సినిమా టికెట్స్ విషయంలో తొలిసారి చిరంజీవి సీరియస్!

గత 19 ఏళ్లుగా సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలోని కళాకారులకు అవార్డులు అందిస్తున్న.సంతోషం అవార్డ్స్ కార్యక్రమం ఎంతటి ప్రత్యేకతని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే.

ఇక.ఇప్పుడు డిజిటిల్ మీడియా జైన్ట్ సుమన్ టీవీ ప్రతిష్టాత్మకంగా మొదటిసారి సంతోషంతో కలసి ఈ అవార్డ్స్ కార్యక్రమంలో భాగం అయ్యింది.

హెచ్ఐసీసీలోని నోవాటెల్‌లో ఈ ఆదివారం సంతోషం-సుమన్ టీవీ సౌత్ ఇండియా ఫిలిం అవార్డ్స్-2021 కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ అవార్డు ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరవ్వడం విశేషం.

విన్నర్స్ కి తన చేతుల మీదగా అవార్డ్స్ అందించిన మెగాస్టార్.ఈ వేదికపై కాస్త ఉద్వేగంగా ప్రసంగించారు.

Advertisement

సినిమా కూడా సమాజానికి సేవ చేసే ఒక మాధ్యమమే.మిగతా ఏ ఇండస్ట్రీలతో పోల్చుకున్నా.

, సినిమా ఇండస్ట్రీ తక్కువ ఏమి కాదు.ఈ విషయాన్ని చెప్పడానికి నేను మాత్రమే అర్హుడిని.

ప్రజలకి ఏదో మంచి చేయాలని రాజకీయాల్లోకి వెళ్ళాను.కానీ.

, సినిమా ఇండస్ట్రీలో ఉండే మంచి అక్కడ లేదు.అక్కడ ప్రజలు ఆదరణ 5 ఏళ్ళకి మాత్రమే పరిమితం.

ఏంటి భయ్యా.. స్వీట్ షాప్ కు స్వీట్స్ కొనడానికి వచ్చాయా ఏంటి ఎలుకలు(వీడియో)
జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 

మళ్ళీ అవకాశం ఇవ్వరు.అదృష్టం బాగుంటే ఎప్పటికో మళ్ళీ ఛాన్స్ వస్తుంది.

Advertisement

కానీ., సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి అలా ఉండదు.

మన ప్రేక్షకులు ఒక్కసారి ప్రేమిస్తే చాలు.జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటారు.

కథ బాగాలేకుంటే ఆ సినిమాని రిజెక్ట్ చేస్తారు తప్ప, నటులను దూరం చేసుకోరు.ఇందుకే ఇకపై సినిమాలకి దూరం కాను.

జీవితాంతం సినిమాలల్లో నటిస్తాను” అని చిరంజీవి తెలియజేశారు.

టికెట్స్ రేట్లు నిర్ణయించే హక్కు మీకు లేదు.

ఈ సమయంలోనే సినిమా టికెట్స్ ధరని ప్రభుత్వాలు నిర్ణయించడంపై చిరంజీవి అభ్యంతరం వ్యక్తం చేశారు మెగాస్టార్.“సినిమా ఇండస్ట్రీనే కదా? వీళ్లది ఏముందని నాయకుల్లారా మమ్మల్ని నిర్లక్ష్యంగా చూడకండి.మా దగ్గర డబ్బులు ఎక్కువైపోయి రూ.100 కోట్ల ఖర్చు పెట్టి సినిమాలు చేయడం లేదు.తెలుగు సినిమా స్థాయిని పెంచడానికి మాత్రమే కృషి చేస్తున్నాము.

ఇలాంటి సమయంలో టికెట్ రేటు ఇంతే ఉండాలి అంటే.ఆ పెద్ద సినిమాలు తీయడం ఎలా సాధ్యం అవుతుంది? ఇండస్ట్రీ బాగుంటే ప్రభుత్వానికి ట్యాక్స్ లు వస్తాయి.లక్షల మందికి ఉపాధి లభిస్తుంది.

ఇలాంటి గొప్ప సినిమా ఇండస్ట్రీ గురించి ప్రజా ప్రతినిధులు బాధ్యతగా మాట్లాడాలి.అయినా.

ప్రభుత్వానికి ట్యాక్స్ లు రావాల్సిందే.మీకు కావాల్సిన ట్యాక్స్ మీరు తీసుకోండి.

దాన్ని ఎవ్వరూ తప్ప పట్టరు కూడా.కానీ.

, టికెట్స్ రేట్లు మీరు ఎలా ఫిక్స్ చేస్తారు? అని చిరంజీవి నిలదీశారు.

తెలుగు రాష్ట్రాలలోని సినిమా కష్టాల గురించి నాయకులకు అర్ధమయ్యేలా చెప్పాలని మీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేశా.కానీ., మీ నుండి స్పందన రాకపోయేసరికి ఇలా ఓపెన్ గా చెప్పాల్సి వచ్చింది.

ఇప్పటికీ ప్రభుత్వాలను ఇండస్ట్రీ తరుపున వేడుకుంటున్నా.తెలుగు సినిమాకి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోండి.

కళాకారులను గౌరవించండి.గతంలో రాజులు కళలను ఆదరించేవారు.

కళాకారులను గౌరవించేవారు.ఈ తరంలో పాలకులే రాజులు.

మీరు కళాకారులను గౌరవిస్తే సినీ ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది.ఇక్కడ కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకెన్ స్టార్స్ ఐదు మంది మాత్రమే.

తిండి కోసం కూడా కష్టపడే వేల కుటుంబాలు సినీ పరిశ్రమలో ఉన్నాయి.వారి కోసమే నా ఆవేదన అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

నంది అవార్డ్స్ ఇవ్వాల్సిందే.

ఏ నటుడికి అయినా అవార్డ్స్ అనేవి ఒక గౌరవాన్ని, నమ్మకాన్ని, గుర్తింపుని తీసుకొస్తాయి.అది ప్రభుత్వం నుండి వచ్చిన అవార్డు అయితే.దాని విలువ మరింత పెరుగుతుంది.

అలాంటి నంది అవార్డ్స్ ని ప్రభుత్వాలు ఎందుకు ఇవ్వడం లేదో తెలియడం లేదు.గతంలో ఈ విషయాన్ని నేను నాయకుల దృష్టికి తీసుకెళ్ళాను కూడా.

కానీ., పరిస్థితిలో మార్పు రాలేదు.

ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వాలను ప్రార్ధిస్తున్నాను.ఆగిపోయిన నంది అవార్డ్స్ ని మళ్ళీ మొదలు పెట్టండి అంటూ మెగాస్టార్ ఎమోషనల్ గా మాట్లాడారు.

చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మరి.ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

తాజా వార్తలు