Megastar Chiranjeevi Ramgopal Verma : ఆర్జీవీ ట్వీట్స్ పై చిరంజీవి సీరియస్.. అది ఎటకారం అంటూ?

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ఒక సినిమా ఇంకా పట్టాలెక్కక ముందే మరొకరు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నాడు.ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమాలో భాగంగా నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి పండుగకు కానుకగా విడుదల కానున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆర్జీవికి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అదేమిటంటే గతంలో చిరంజీవి దర్శకుడు ఆర్జీవి పై చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

అయితే ఆ ఛానల్ లో యాంకర్ గా హీరోయిన్ రోజా వ్యవహరించారు.ఈ నేపథ్యంలోనే రోజా అడిగిన పలు ప్రశ్నలకు మెగాస్టార్ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు.

మెగా బ్రదర్ నాగబాబు పై కోప్పడిన రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ పై ప్రేమ కురిపించడానికి కారణం ఏమిటి అని రోజా ప్రశ్నించగా.ఆ విషయం పై స్పందించిన చిరంజీవి రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడటం వేస్ట్ అని నవ్వుతూ, అతనిది ఒక డిఫికల్ట్ మైండ్ సెట్.

ఎప్పుడు ఎలా ఉంటాడో ఎప్పుడు ఏం మాట్లాడతాడో అతనికి తెలియదు.ఒకరిని పొగుడుతూనే మరొకరిని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటాడు.సినిమాకు సంబంధించిన ఏదో ఒక స్టిల్స్ విడుదల అయితే అందులో ఒక లోపం చూపిస్తూ కామెంట్స్ చేస్తూనే ఉంటాడు.

ఆర్జీవికి సంస్కారం కంటే వెటకారం ఎక్కువ.అలాగే అంతటి మేధావి కూడా.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

వెటకారం తగ్గించుకొని డైరెక్టర్ గా రాణిస్తే మంచి స్థాయికి ఎదుగుతాడు అని తెలిపాడు చిరంజీవి.

Advertisement

తాజా వార్తలు