చిరంజీవి ఆచార్య సినిమా ఎవరు ఔనన్నా కాదన్నా డిజాస్టర్ గా నిలిచింది.దాదాపుగా 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఆచార్య సినిమా కనీసం 30 కోట్ల షేర్ ను కూడా రాబట్టలేక పోయింది అంటూ టాక్ వినిపిస్తుంది.
మొదటి మూడు రోజుల్లో ఒక మోస్తరుగా వసూళ్లు రాబట్టిన సోమవారం నుండి సినిమా దారుణమైన వసూళ్లను నమోదు చేస్తుంది.చాలా చోట్ల షో లను క్యాన్సిల్ చేస్తున్న వార్తలు కూడా వస్తున్నాయి.
ఈ సమయంలోనే ఆచార్య లెక్కలు ప్రస్తుతం ఆశ్చర్యంకు గురి చేస్తున్నాయి.సినిమా వల్ల ఎవరు ఎంత నష్టపోయారు ఎంత లాభం పొందారు అనే విషయానికి వస్తే మెగా హీరోలు చిరంజీవి మరియు చరణ్ లు ఎక్కువగా లాభాలు దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇక దర్శకుడు కొరటాల శివ ఈ సినిమా ను సన్నిహితుడి కోసం చేశాడు.కనుక పారితోషికం తీసుకోకుండా లాభాల్లో వాటాను తీసుకుంటాను అంటూ ముందస్తుగానే ఒప్పందం చేసుకున్నాడు.
ఇక మెగా హీరోలు ఇద్దరు తమ పారితోషికంను పెట్టుబడిగా పెట్టి నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారు.నిర్మాతగా చరణ్ పెద్దగా బాధ్యతలు తీసుకోలేదు.
కాని ఆయన మెయిన్ నిర్మాతగా మాత్రం టైటిల్ వేయడం జరిగింది.
నిరంజన్ రెడ్డి పూర్తి నిర్మాణ బాధ్యతను నెత్తిన వేసుకున్నాడు.
ఆయన భారీగానే ఖర్చు చేశాడు.అయితే సినిమా కు వచ్చిన బజ్ నేపథ్యంలో భారీ మొత్తానికి అమ్ముడు పోయింది.
దాదాపుగా 120 కోట్లకు అమ్ముడు పోయింది కనుక నిర్మాతలకు ఎలాంటి నష్టం అనేది లేకపోవచ్చు.కాని దర్శకుడు కొరటాల శివ పారితోషికంగా లాభాల్లో వాటా అనుకున్నాడు కనుక ఇప్పుడు అది వచ్చే అవకాశం లేదు.
ఇక హీరోలు ఇద్దరు కూడా తక్కువ పారితోషికం తోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి.ఇక్కడ అధికంగా నష్టపోయింది డిస్ట్రిబ్యూటర్లు మరియు బయ్యర్లు ఇంకా ఎగ్జిబ్యూటర్లు అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వారే పూర్తి నష్టం భరించకుండా కాస్త నిర్మాతలు కూడా భరించేలా కొన్ని ఏరియాల్లో ఒప్పందం జరిగిందని సమాచారం.ఆ విషయమై మరింత సమాచారం రావాల్సి ఉంది.
ఆచార్య లెక్కలతో సంబంధం లేకుండా చిరంజీవి భార్య సురేఖ గారితో కలిసి హాలీడే ట్రిప్ కు వెళ్లారు.తిరిగి వచ్చాక గాడ్ ఫాదర్ మరియు భోళా శంకర్ సినిమాలను పూర్తి చేసి వెంకీ కుడుముల సినిమాను మొదలు పెట్టాల్సి ఉంది.