ఆచార్య బయ్యర్లకు మెగా హీరోలు 25 కోట్లు తిరిగి ఇచ్చేశారా..నిజమేంటంటే?

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్ లలో కొరటాల శివ ఒకరు.ఈయన మొదటి నుండి అందరి కంటే డిఫెరెంట్ గా సినిమాలు చేస్తూ వరుస విజయాలు సాధించాడు.

 Chiranjeevi Charan Together Refund Rs 25 Crores To Acharya Buyers, Koratala Siva-TeluguStop.com

కానీ మొదటిసారి ఆచార్య విషయంలో మాత్రం పూర్తిగా విఫలం అయ్యాడు. చిరంజీవి, రామ్ చరణ్ తో కలిసి చేసిన ఆచార్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొడతారు అని అంతా అనుకున్నారు.

కానీ భారీ ప్లాప్ మూటగట్టుకున్నాడు.అసలు ఇది కొరటాల తీసిన సినిమానేనా అని అంతా ఆశ్చర్య పోయారు.

అంతేకాదు ఈ సినిమా వల్ల బయ్యర్లకు భారీ నష్టం వచ్చింది.దీంతో నష్టపోయిన బయ్యర్లకు సెటిల్ చేయాల్సి రావడంతో.కొరటాల నే ఈ భాద్యత తీసుకున్నాడని వార్తలు వచ్చాయి.కొరటాల బయ్యర్ల ఆందోళన కారణంగా కొంత అమౌంట్ సెటిల్ చేసి పంపించారని రూమర్స్ వినిపించాయి.

దీంతో కొరటాల మీద సానుభూతితో సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ కొరటాల శివ అనే హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేసేసారు.

సినిమాకు నష్టం వస్తే నిర్మాతలు భరించాలి కానీ దర్శకుడి మీదనే మొత్తం భారం వేయడం ఏంటని చాలా మంది కామెంట్స్ చేసారు.

ఈ సినిమాను నిరంజన్ రెడ్డి నిర్మించారు.కొరటాల, చిరు, చరణ్ ఎవ్వరూ కూడా ఈ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోలేదని నిర్మాత చెప్పుకొచ్చాడు.నిరంజన్ రెడ్డి సినిమా వ్యాపారంలో యాక్టివ్ గా ఉండక పోవడంతో కొరటాల ఈ సినిమాను మంచి రేట్లకు అమ్మారట.దీంతో ఇప్పుడు నష్టం రావడంతో ఈయన వెంటే పడుతున్నారు బయ్యర్లు.

.

Telugu Acharya, Acharya Buyers, Chiranjeevi, Koratala Siva, Ram Charan, Refund R

అయితే మెగా హీరోలు స్పందించక పోవడంతో అందరు ఫైర్ అవుతున్నారు.కానీ వాస్తవం ఏంటంటే.ఈ సినిమా కోసం తండ్రి కొడుకులు చిరంజీవి, చరణ్ కలిపి దాదాపు 25 కోట్లు తిరిగి ఇచ్చారట.

ఈ డబ్బుతోనే వీరు బయ్యర్లకు చాలా వరకు ఆర్ధిక నష్టం కలగకుండా భర్తీ చేసారని టాక్ ఇప్పుడు నెట్టింట వినిపిస్తుంది.కానీ ఇవేమీ బయటకు తెలియక అంతా వీరిపై విమర్శలు చేస్తున్నట్టు చెబుతున్నారు.

మెగా ఫ్యాన్స్ కూడా ఈ సందర్భంగా వీరిని సపోర్ట్ చేస్తూ మద్దతుగా నిలుస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube