మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi )ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.
మనవరాల్ని ఎత్తుకోవాల్సిన వయసులో కూడా ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తూ హీరోగా రాణిస్తున్నారు.అయితే రియల్ లైఫ్ లో ఎప్పుడో తాత అయిన చిరంజీవి రీల్ లైఫ్ లో మాత్రం ఇంకా తాత పాత్రలను పోషించలేదు.
ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి తాత పాత్రలో కనిపించబోతున్నారట.

స్టార్ హీరో కమల్ హాసన్,( Kamal Haasan ) సూపర్ స్టార్ రజినీకాంత్</em( Rajinikanth ) మాదిరిగా చిరంజీవి కూడా సిల్వర్ స్క్రీన్ పై తాతగా ఎంటర్టైన్ చేయనున్నారట.కాగా గత ఏడాది విడుదలై భారీ విజయం సాధించిన విక్రమ్ సినిమాలో ఏజెంట్ అరుణ్ కుమార్ విక్రమ్ గా ఆకట్టుకున్నారు కమల్ హాసన్.అందులో తాతగా నటించి మెప్పించారు.
ఇక తాజాగా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న జైలర్ సినిమాలో రిటైర్డ్ జైలర్ ముత్తుగా అలరించారు రజినీకాంత్.ఇందులోనూ తాతగా కనిపించి మెప్పించారు.
ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా రీల్ లైఫ్ లో తాతగా కనిపించబోతున్నారట.

కోలీవుడ్ కెప్టెన్ ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో మెగాస్టార్ ఒక సినిమా చేయబోతున్నట్లు ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.ఇందులో పవర్ ఫుల్ ఆఫీసర్ రోల్ లో దర్శనమివ్వనున్నారట చిరు.అలాగే విక్రమ్, జైలర్ తరహాలో మనవడి సెంటిమెంట్ కూడా ఉంటుందని తెలుస్తోంది.మరి ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.ఇకపోతే మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే.చిరంజీవి తాజాగా నటించిన భోళా శంకర్ సినిమా ( Bhola Shankar )భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.దీంతో మెగాస్టార్ ఖాతాలో మరో భారీ డిజాస్టర్ సినిమా చేరింది.