తిరుపతి మాజీ ఎంపీ.సీనియర్ నాయకుడు.
చింతా మోహన్.వైసీపీని టార్గెట్ చేశారా? వ్యూహాత్మకంగా ఆయన పావులు కదుపుతున్నారా? వైసీపీపైనా.సీఎం జగన్‌పైనా ఆయన చేసిన విమర్శల వెనుక.చాలా స్ట్రాటజీ ఉందా? అంటే.ఔననే అంటున్నారు పరిశీలకులు.ప్రస్తుతం తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరిగేందుకు రంగం సిద్ధమవుతోంది.
మరో నెలలో దీనికి షెడ్యూల్ విడుదల చేయనున్నారు.ఈ నేపథ్యంలో అనూహ్యంగా చింతా మోహన్.
అధికార పార్టీని అన్ని వైపు లనుంచి టార్గెట్ చేయడం సంచల నంగా మారింది.
విషయంలోకి వెళ్తే.
కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్… రాష్ట్ర విభజన తర్వాత.అందరూ వేరే వేరే పార్టీలు చూసుకుంటే.
ఆయన మాత్రం కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు.తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు.
ఈ క్రమంలో అనూహ్యంగా ఆయన వైసీపీపై విమర్శలు సంధించడంలో ముందున్నారు.గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అప్పటి ప్రతిపక్షం వైసీపీ ని విమర్శించేవారు.
తాజాగా మరోసారి.వైసీపీపై విరుచుకుపడ్డారు.
వైఎస్ తర్వాత జగన్ కాంగ్రెస్‌ను ఎలా దెబ్బతీశారో ఆయన వివరించారు.జగన్ అంత బలహీన ముఖ్యమంత్రిని తానెప్పుడూ చూడలేదన్నారు.

కాంగ్రెస్ పార్టీ వల్లే వైఎస్ కుటుంబం ఉన్నత స్ధాయికి వచ్చిందన్న చింతామోహన్….కాంగ్రెస్ పార్టీని వైఎస్ కుటుంబమే దారుణంగా దెబ్బ తీసిందన్నారు. ముఖ్యంగా రెడ్డి నేతలను వైఎస్ రాజశేఖరరెడ్డే దెబ్బతీశారని సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం.జేసీ దివాకర్‌రెడ్డి, ఎంవీ మైసూరారెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కాసు కృష్ణారెడ్డిలను రాజకీయంగా దెబ్బతీశారని అన్నారు.
గతంలో కాంగ్రెస్ తెచ్చిన రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, అందరికీ ఇళ్లు, ఆరోగ్యశ్రీ పథకాలను వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన సొంత పథకాలుగా చిత్రీకరించారని నిప్పులు చెరగడం కూడా సంచలనంగా మారింది.

జగన్, షర్మిలలు రాజన్న రాజ్యం తెస్తామంటూ రాజకీయాలు చేయడంపైనా చింతా మోహన్ మండిప డ్డారు.తండ్రి సృష్టించిన ఆర్ధిక వనరులను వాడుకుంటూ ఇప్పుడు రాజన్న రాజ్యం పేరుతో జగన్, షర్మిల చేస్తున్న హడావిడి పిల్ల చేష్టలుగా కనిపిస్తోందని చింతా విమర్శించారు.జగన్ పాలనలో అవినీతి పెరిగిపో యిందన్నారు.
ప్రతి ఫైల్‌కూ పైసలు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
మైనింగ్, ఇసుక, మద్యం వ్యాపారాల్లో వందల కోట్లు దండుకుంటున్నారని విమర్శించారు.
అయితే.చింతా మోహన్ ఇలా విరుచుకుపడడం వెనుక వ్యూహం ఉందనేది విశ్లేషకుల మాట.
తిరుపతి పార్లమెంటుకు త్వరలోనే ఉప ఎన్నిక రానుంది.ఈ క్రమంలో కాంగ్రెస్ తరఫున చింతా మోహన్ బరిలోకి దిగనున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆయన ఇలా విమర్శలు చేశారనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం.మరి ఇది వర్కవుట్ అవుతుందా లేదా చూడాలి.