వైరల్‌ : దేవుడికి ఇచ్చిన హారతి కళ్లకు అద్దుకోవద్దట

దేవుడికి హారతి ఇచ్చిన వెంటనే ఆ హారతిని ప్రతి ఒక్కరు కళ్లకు అద్దుకునేందుకు ఇష్టపడతారు.

హారతి తీసుకోవాలంటూ చాలా మంది ఎన్ని పనులు ఉన్నా కూడా హారతి సమయంకు గుడికి వెళ్లడం లేదంటే ఇంట్లో పూజ సమయంకు ఇంటికి చేరుకోవడం చేస్తారు.

హారతి అనేది పూజలో చాలా ముఖ్యమైన ఘటం.చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు అంతా కూడా హారతి తీసుకుని కళ్లకు అద్దుకుంటారు.దేవుడికి ఇచ్చిన హారతి అవ్వడం వల్ల ప్రతి ఒక్కరు తీసుకునేందుకు ఎగబడుతారు.

హారతి అనేది దేవుడి ఆశీస్సుల కోసం అంటూ అంతా అనుకుంటారు.కాని హారతి గురించి ప్రముఖ ఆద్యాత్మిక గురువు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్‌ స్వామి వారు కొత్త విషయాలను తెలియజేశారు.

హారతిని కళ్లకు అద్దుకోవద్దు అంటూ ఆయన చెబుతున్నాడు.కర్పూరం లేదా మరేదైనా దీపంతో దేవుడికి హారతి ఇవ్వడం అంటే ఆయనను అలంకరించి, పూజించి, ప్రసాదం పెట్టిన తర్వాత ఎవరి దిష్టి తగలకుండా దిష్టి తీసేది హారతి.

Advertisement
Chinna Jeeyar Swamy About Harathi In Hindu Pooja-వైరల్‌ : దేవ

అలాంటి దిష్టి దీపంను కళ్లకు అద్దుకోవడం ఎందుకు అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు.

Chinna Jeeyar Swamy About Harathi In Hindu Pooja

ఇటీవల హైదరాబాద్‌లో ధనుర్మానోత్సవ ప్రవచనాల సందర్బంగా భక్తులకు చినజీయర్‌ స్వామివారు ఈ విషయాన్ని తెలియజేశారు.హిందువు అంటే హారతి, హారతిని కళ్లకు అద్దుకోవడం అని ప్రతి ఒక్కరి మదిలో ఉండి పోయింది.అలాంటిది ఇప్పుడు స్వామివారు చెప్పినా కూడా దాన్ని పట్టించుకునే స్థితిలో ఎవరు లేరు.

హారతి కళ్లకు అద్దుకుంటేనే అసలైన పూజ పరిసమాస్తం అయినట్లుగా భక్తులు భావిస్తున్నారు.అందుకే గుడిలో కూడా హారతి ఇస్తూ ఉంటారు.

మరి హారతి విషయంలో ముందు ముందు మత పెద్దలు, హిందూ ధర్మ పండితులు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చూడాలి.

చేపల్ని ఇలా తింటే.. మీ జబ్బులు పరార్‌!
Advertisement

తాజా వార్తలు