హిందూ మహా సముద్రంలో ( Indian Ocean )చైనా నౌకాదళాలవారు చేస్తున్న కార్యకలాపాలను చూసి భారత ప్రభుత్వం, రక్షణ రంగ నిపుణులు గుర్రుగా వున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.2020లో గాల్వన్ లోయ దగ్గర భారత్- చైనా( India- China ) సైనికులు ఘర్షణ పడినప్పుడు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగిన సంగతి విదితమే.అయితే మన ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం ఎప్పటి నుంచో కొనసాగుతోంది… అది వేరే విషయం.ఇపుడు తాజాగా హిందూ మహా సముద్రం మీద ఆధిపత్యం కోసం భారత్ – చైనా పోటీ పడుతుండడం గమనార్హం.

కొన్ని దశాబ్ధాలుగా పరిశీలిస్తే చైనా తన నేవీని వేగంగా ఆధునీకరిస్తూ వస్తోంది.చైనా నౌకాదళంలో యుద్ధ విమాన వాహక నౌకలు( Aircraft carriers ), యుద్ధ నౌకలు, అణ్వాయుధాలను అమర్చిన సబ్ మెరీన్లు మెండుగా వున్నట్టు తెలుస్తోంది.చైనా ఓడ రేవు కార్యకలాపాలను ప్రస్తావిస్తూ పాకిస్తాన్‌లోని గ్వాదర్ పోర్టు, శ్రీలంకలో హంబన్‌టోటా నౌకాశ్రయాల ( Hambantota Ports in Sri Lanka )విషయంలో గత ప్రభుత్వాలపై విమర్శలు చేస్తున్నాయి ప్రస్తుత ప్రభుత్వాలు.ఇక పరిశీలకులు ఏం చెబుతున్నారంటే హిందూ మహా సముద్రంలో చైనా అనుసరిస్తున్న వ్యూహాన్ని ‘స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్’గా చెబుతున్నారు.

దీని అర్ధం ఏమిటని అనే అనుమానం కలుగుతోంది కదూ.హిందూ మహాసముద్రం చుట్టు ఉన్న దేశాలలో వ్యూహాత్మక నౌకాశ్రయాలు నిర్మించడం, చైనా నుంచి అక్కడకు తేలికగా చేరుకునేలా మౌలిక వసతుల్ని కల్పించడం, అవసరమైతే సైనిక ప్రయోజనాల కోసం వీటిని ఉపయోగించుకోవడమే ఈ వ్యూహం అభిమతం.ఇంధన ప్రయోజనాలు, భద్రత లక్ష్యాలను కాపాడుకునేందుకు మధ్య ప్రాచ్యం నుంచి దక్షిణ చైనా సముద్రం వరకూ ఉన్న సముద్ర మార్గాల్లలో వ్యూహాత్మ సంబంధాల అభివృద్ధి పేరుతో వివిధ దేశాల్లో చైనా నౌకాశ్రయాలను అభివృద్ధి చేస్తోంది.కాగా హిందూ మహా సముద్రంలో చైనా విస్తరిస్తున్న తీరుతో భారత్‌కు ఖచ్చితంగా ముప్పు వాటిల్లనుందని హెచ్చరిస్తున్నారు మేధావులు.