కుండపోత వర్షంలో పిల్లలకు తానే షెల్టర్‌గా కోడి.. వీడియో వైరల్..

తల్లి అనేది ప్రపంచంలోనే అత్యంత మధురమైన మరియు సున్నితమైన పదం.ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనిస్తుంది.

బిడ్డల సంరక్షణకు కూడా తన జీవితాన్ని త్యాగం చేస్తుంది.ఈ ప్రపంచంలో బిడ్డలకు తొలి గురువు తల్లి.

కేవలం మనుషులలోనే కాకుండా జంతువులు, పక్షులలో కూడా ఈ మాతృత్వం కనిపిస్తుంది.తనకేమైనా తన బిడ్డలు మాత్రం బాగుండాలనే తపన జంతువులు, పక్షులలో కూడా ఉంటుంది.

దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియోను ఏఎస్ అధికారి డాక్టర్ సుమితా మిశ్రా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

Advertisement

వీడియోలో, కోడి తన కోడిపిల్లలను వర్షం నుండి రక్షించడానికి రెక్కలు చాచి నిలబడి ఉంది.వర్షం నుండి తమను తాము రక్షించుకోవడానికి అన్ని చిన్న కోడిపిల్లలు తల్లి కోడి రెక్కల మధ్య నిలబడి ఉన్నాయి.

కుండపోత వర్షంలో ఆ కోడి తడుస్తున్నా, పిల్లలను తడవనీయకుండా కాపాడింది.వర్షానికి తడిసిముద్దవుతున్నా తన పిల్లలను కాపాడుకోవడానికి, ఆమె తన పిల్లలు సురక్షితమైన ఆశ్రయం పొందగలిగేలా పైకప్పుగా మారింది.

పక్షులు తమ పిల్లలను ప్రమాదాల నుండి కాపాడడానికి తమ రెక్కల క్రింద రక్షించే వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి.మాతృత్వానికి ఇదో ఉదాహరణ అని, తల్లి ప్రేమకు మించింది ఇంకేదీ లేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.అమ్మతనానికి ఉన్న గొప్పతనం ఇదే అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

పిల్లలను కాపాడటంలో తల్లికి మించిన యోధులు మరెవరు ఉండరునే నిజాన్ని ఈ వీడియో మరోసారి నిరూపించింది.దీనిని మీరు కూడా చూసేయండి.

తుమ్మినప్పుడు కళ్లు మూసుకుంటాం ఎందుకు? కళ్లు తెరిచి తుమ్మితే అలా జరుగుతుందా??
Advertisement