ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ వ్యవహారంలో పలువురు ప్రముఖులకు నోటీసులు

ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ ప్రకటనలో నటించిన పలువురు ప్రముఖులకు కోర్టు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది.

ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ వ్యవహారం పై కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.

ఆ ప్రకటనల్లో నటించిన తమన్నా,ప్రకాష్ రాజ్,రానా దగ్గుపాటి, క్రికెటర్స్ విరాట్ కోహ్లీ,సౌరవ్ గంగూలీ లకు కూడా మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.అయితే ఈ రోజు ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌ పై మద్రాస్‌ హైకోర్టు లో పిటీషన్ దాఖలు కాగా, దానిపై కోర్టు విచారణ జరిపింది.

Chennai High Court Issues Notices To Virat Kohli,Sourav Ganguly And Tamanna For

ఈ పిల్‌ పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు క్రికెటర్లు విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ, సినీ నటులు తమన్నా, ప్రకాశ్ రాజ్, దగ్గుబాటి రానా, సుదీప్‌లకు కూడా నోటీసులు పంపించింది.ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కారణంగా చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారంటూ కోర్టు లో పిటీషన్ దాఖలు కావడం తో ఈ మేరకు ప్రముఖులు అందరికి కూడా నోటీసులు జారీ చేసింది.

నవంబర్ 19లోగా తమకు సమాధానమివ్వాలని వారందరికి ఆదేశాలు జారీ చేసింది మద్రాస్ హైకోర్టు.ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ ప్రకటనల్లో నటించిన ప్రముఖ నటులందరికి కూడా చెన్నై హైకోర్టు మంగళవారం నోటీసులు జారీచేసింది.

Advertisement

ఆన్‌లైన్‌ జూదం నిషేధం కేసుపై విచారణ చేపట్టిన మదురై బెంచ్‌ వీరికి నోటిసులు జారీ చేసింది.గంగూలీ,విరాట్‌తో పాటు సినీ ప్రముఖులు ప్రకాశ్‌రాజ్‌, తమన్నా, రానా, సుదీప్‌లకు కూడా బెంచ్‌ నోటీసులు ఇచ్చింది.

అన్‌లైన్ జూదం యాప్‌లకు ప్రచారకర్తలుగా వ్వవహిస్తున్నందుకు కోర్టు ఈ నోటుసులు జారీ చేసింది.ఆన్‌లైన్‌ రమ్మీ కారణంగా చాలా మంది ఆత్మహత్యలు పాల్పడుతున్నారని, కావున ఆ యాప్స్ నిషేధించాలని దాఖలైన పిల్‌పై విచారణ జరిపిన బెంచ్.

ఈ చర్యలు చెపట్టింది.అలాగే తమిళనాడు ప్రభుత్వంపై కూడా పలు ప్రశ్నలు సందించింది.

ఆన్‌లైన్‌ జూదంపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అడిగిన కోర్టు.అందులో పెట్టిన డబ్బు ఎక్కడిపోతుందని ప్రశ్నించింది.

అధిక బరువుతో వర్రీ వద్దు.. నిత్యం ఈ హెర్బల్ వాటర్ ను తాగితే నెల రోజుల్లో సన్నబడతారు!

రాష్ట్రంలో ఆన్‌లైన్ రమ్మీ నిషేధంపై ప్రభుత్వం ఏమి చేస్తుందో వివరణ ఇవ్వాలని బెంచ్. ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Advertisement

పది రోజుల్లో ఆన్‌లైన్ ప్యాంటసీ యాప్స్‌పై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపిన కోర్టు తెలంగాణలో ఇప్పటికే ఆన్‌లైన్‌ జూదం నిషేధించారని మధురై కోర్టు ఈ సందర్భంగా గుర్తుచేసింది.

తాజా వార్తలు