మొదటిసారి నెగిటివ్ రోల్ లో సందడి చేయనున్న చరణ్..ఇందులో నిజమెంత?

టాలీవుడ్ స్టార్ హీరో అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.

ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పటివరకు చెర్రీ కెరీర్ లో చరణ్ నటించిన రెండు సినిమాలు ఒకేసారి ఒక నెలలో విడుదల కావడం ఇదే మొదటిసారి.ఇక ఇప్పటి వరకు రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాలో కూడా నటించలేదు.

అదే విధంగా దర్శకుడు శంకర్ కూడా హిందీ తమిళ హీరోలతో తప్ప తెలుగు హీరోతో ఇంతవరకు ఒక్క సినిమా కూడా తెరకెక్కించకపోగా మొదటిసారి రామ్ చరణ్ తో సినిమాను తెరకెక్కించబోతున్నారు దర్శకుడు శంకర్.వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రారంభించారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో రామ్ చరణ్ కు ఒక సరికొత్త లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.అంతేకాకుండా ఈ సినిమాలో చరణ్ ఒక డ్యూయల్ రోల్ లో నటించబోతున్నాడు అని తాజాగా ఒక వార్త చక్కర్లు కొడుతోంది.

ఒక పాత్రలో చరణ్ కు కోపం ఎక్కువగా ఉంటుందని.అతడు చేసే మ్యానరిజం చూడడానికి చాలా బాగుంటుందని తెలుస్తోంది.ఇంకొందరు మాత్రం చరణ్ ఇందులో మూడు పాత్రలు చేస్తున్నాడని అంటున్నారు.

ఒకటి ఇందులో తండ్రి పాత్ర కాగా మరొక రెండు పాత్రల్లో ట్విన్స్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.కానీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదు అన్నది అంతర్గత సమాచారం.

Cool Bet Im Überblick : Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten
సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు

చరణ్ కేవలం రెండు పాత్రల్లో మాత్రమే కనిపించబోతున్నాడని తెలుస్తోంది.

Advertisement