“మోడీ” కి చంద్రబాబు మార్క్ “స్కెచ్”..ముహూర్తం “మే 7”

ఏపీ పై బీజేపి చేసిన దారుణమైన మోసాన్ని.ఎప్పటికప్పుడు ఎండగడుతూ తన ఎంపీలు, ఎమ్మెల్యేలు ద్వారా ఢిల్లీ లో ఎన్నడూ లేనతంగా నిరసనలు తెలిపి ప్రకంపనలు రేపిన చంద్రబాబు నాయుడు.

 Chanrababu Naidu Decission On Modi-TeluguStop.com

మోడీ చేస్తున్న మోసాన్ని ఎండగట్టారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి దీక్షకి ఎందుకు దిగారని అందరినీ ఆలోచింపచేసేలా చేశారు.దాంతో మోడీ నాలుగేళ్ళుగా కష్టపడి సంపాదించిన పేరు కాస్తా బూడిదలో పోసిన పన్నీరు అయ్యిందనే చెప్పాలి.

అయితే చంద్రబాబు కేంద్రంపై ఎంతో ఒత్తిడి తీసుకురావాలని అనుకున్నా సరే మోడీ ఏపీ విషయంలో మాత్రం ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో…చంద్రబాబు ఎంతో వ్యూహాత్మకంగా తన పుట్టిన రోజున దీక్ష చేశారు.అయితే ఈ దీక్ష ఎఫెక్ట్ మోడీ జీ కి గట్టిగానే తగిలింది.ఒక రాష్ట్ర సీఎం ఇంతలా దీక్షలు చేస్తున్నా సరే కేంద్రం ఉలుకు పలుకు లేకుండా ఉండటం సర్వాత్రా చర్చనీయంసం అయ్యింది.అయితే పట్టు వదలని చంద్రబాబు మరో మారు ఏపీ తరుపున ఏపీ ప్రజల తరుపున తన నిరసన గళాన్ని వినిపిచడానికి మరో ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే.

చంద్రబాబు మళ్ళీ ఈ నెల 30న తిరుపతిలో భారీ బహిరంగ సభ పెట్టి, మోడీ మోసం పై ప్రజలకు వీడియోలు, డాక్యుమెంట్ లు చూపించి మరీ, ఎండగట్టనున్నారు… అయితే, ఈ నెల 7న అమరావతిలో, బీజేపీ యేతర పార్టీలు అన్నీ సమావేశం కానున్నాయి అయితే ఇదే సమావేశంలో, చంద్రబాబు, బీజేపీ, కాంగ్రెస్ యేతర ఫ్రంట్ ప్రకటన చేస్తారని ఈ ప్రకటన మోడీ కి భారీ షాక్ ఇవ్వనుంది అంటున్నారు.ఈ విషయంపైనే నేషనల్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి…అయితే ఈ మే 7న అన్ని రాష్ట్రాలని చంద్రబాబు మోడీ కి వ్యతిరేకంగా ఏకం చేయబోతున్నారట.

ఇదిలాఉంటే ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలను ఒక్కతాటి పై తెచ్చిన చంద్రబాబు, ఈ సారి దేశంలో వివిక్షకు గురవుతున్న మిగతా రాష్ట్రాలను కూడా రమ్మని కబురు పంపించారట.మే 7న విజయవాడలో ఈ సమావేశం జరగనుంది.

అదే రోజున చంద్రబాబు బీజేపీ యేతర రాష్ట్రాలను ఏకం చేసి, ఒక ఫ్రంట్ ని కూడా ప్రకటించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఇటీవల తిరువనంతపురంలో భేటీ కాగా, రెండో భేటీని విజయవాడ వేదికగా నిర్వహించాలని డిసైడ్ అయ్యారట.

అయితే మే 7 న జరుగబోయే సదస్సులో చంద్రబాబు, కొత్త ఫ్రంట్ గురించి ప్రకటన చేస్తారా అనేది చూడాల్సి ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube