రవితేజ నిర్మాణంలో 'ఛాంగురే బంగారురాజా'.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!

వినాయక చవితికి చాలా సినిమాలు వస్తాయని ఫ్యాన్స్ అంతా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూసారు.

సెప్టెంబర్ 18న వినాయక చవితి రాగా ఆ రోజు హాలిడే.

ఇక దాని కంటే ముందే వీకెండ్ కావడంతో సినిమాలు ఈ వీకెండ్ లో బాగా క్యాష్ చేసుకుంటాయి అని అనుకున్నారు.కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.

ముందు అనుకున్న సినిమాలు కూడా రావడం లేదు.

దీంతో ఇంత మంచి వీకెండ్ ను పెద్ద సినిమాలు మిస్ అవ్వడంతో ఇప్పుడు చిన్న సినిమాలు వరుసగా రిలీజ్ అయ్యేందుకు క్యూ కడుతున్నాయి.అందులో ఛాంగురే బంగారురాజా సినిమా ఒకటి.మాస్ మహారాజా రవితేజ( Ravi Teja ) ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ నిర్మాతగా కూడా రాణించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

ఈ క్రమంలోనే ఈయన నిర్మించిన లేటెస్ట్ మూవీ ఛాంగురే బంగారురాజా( Changure Bangaru Raja )ఈ సినిమాను సతీష్ వర్మ డైరెక్ట్ చేయగా కార్తీక్ రత్నం( Karthik Rathnam ) హీరోగా నటించాడు.గోల్డీ నిస్సీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.దీంతో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు.

ఈ ఈవెంట్ లో ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు.రంగురాళ్ల నేపథ్యంలో ఈ సినిమా కథ ఫన్నీగా తెరకెక్కించినట్టు ట్రైలర్ తో అర్ధం అయ్యింది.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ కూడా హాజరయ్యి సినిమాపై కాన్ఫిడెంట్ ను తెలిపారు.తనకు సినిమా బాగా నచ్చిందని ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు టైపులో ఉంటుందని నా నమ్మకం ప్రూవ్ అవ్వాలంటే సెప్టెంబర్ 15 వరకు ఆగాలి అంటూ తెలిపాడు.

పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...
Advertisement
https://youtu.be/FowxUtdJBR8

తాజా వార్తలు