తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ లో మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి.ఇందులో భాగంగా మే 12 నుంచి 14 వరకు తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి తెలిపింది.
మే 10, 11 తేదీన అగ్రికల్చర్ ఫార్మసీ పరీక్ష జరగనుంది.కాగా గతంలో మే 7 నుంచి 14 వరకు తెలంగాణ ఎంసెట్ నిర్వహిస్తామని షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఆయా తేదీల్లో నీట్, టీఎస్పీఎస్సీ పరీక్ష తేదీలు ఉండటంతో ఎంసెట్ పరీక్ష తేదీలను మార్పు చేసినట్లు విద్యామండలి వెల్లడించింది.