టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!!

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్( Nampally Exhibition ) గ్రౌండ్స్ లో టీడీపీ 41వ ఆవిర్భావ సభ నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధినేత చంద్రబాబు మొదట ఎన్టీఆర్( NTR ) విగ్రహానికి నివాళులర్పించారు.

ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు.అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాజకీయ చరిత్రను తిరగరాసిన రోజు మార్చి 29 అని వెల్లడించారు.

తనకు ఎంతో గుర్తింపు ఆదరణ కలిగించిన తెలుగుజాతి గర్వపడేలా నాడు ఎన్టీఆర్ పార్టీ స్థాపించారని వివరించారు.తనని ఎంతగానో ఆదరించిన తెలుగు ప్రజల కోసం ఏదైనా చేయాలన్న తపనతో ఈ పార్టీని ఎన్టి రామారావు స్థాపించారని చెప్పుకొచ్చారు.

అటువంటి గొప్ప మహానీయుడు మనసులో నుంచి వచ్చిన పార్టీ టీడీపీ అని కొనియాడారు.పార్టీ పెట్టిన ప్రారంభంలో ఆయన చేసిన స్పీచ్ కూడా సొంతంగా చేసింది.తెలుగు జాతి నాది.

Advertisement

ఆ తెలుగుదేశం కోసమే పార్టీ పెడుతున్న.దాని పేరే తెలుగుదేశం అని అప్పటికప్పుడు ప్రకటించారు.

ఈ క్రమంలో పసుపు రంగు శుభానికి చిహ్నం అని ఆనాడు ఎన్టీఆర్ ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్ వెల్లడించారని పేర్కొన్నారు.తెలుగుదేశం పార్టీ జెండాలో రైతు చిహ్నం, రాట్నం కార్మికుల చిహ్నం, గుడిసె పేదవాడికి చిహ్నం అని వివరించారు.

చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ పార్టీ ఉంటుందని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలుగు ప్రజల కోసం పనిచేసే పార్టీ టీడీపీ అని వ్యాఖ్యానించరు.

మన చేతి రేఖలలో మార్పులు జరుగుతాయా... ఈ మార్పు దేనికి సంకేతం?
Advertisement