ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణ వాయిదా

ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది.

ఈ మేరకు విచారణను సుప్రీంకోర్టు డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది.

ఈ పిటిషన్ ను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదీల ధర్మాసనం విచారించింది.ఇందులో భాగంగానే ఫైబర్ నెట్ కేసులో డిసెంబర్ 12 వరకు చంద్రబాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఈ పిటిషన్ పై గతంలో విచారణ జరగగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చిన తరువాత ఈ పిటిషన్ ను పరిశీలిస్తామని న్యాయస్థానం వెల్లడించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడని నేపథ్యంలో విచారణను సుప్రీం ధర్మాసనం మరోసారి వాయిదా వేసింది.

మన ఇంటి ఆనంది మనోళ్లకు పెద్దగా నచ్చలేదు.. జాంబిరెడ్డి హీరోయిన్ ఆనంది గురించి ఆసక్తికర విషయాలు
Advertisement