బాలయ్య బాబు కి ఈ సారి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడం లేదు అనే ప్రచారం గత కొన్ని నెలలుగా జరుగుతూనే వుంది.అయితే ఈ ప్రచారం ఎక్కడ పుట్టిందో ఏమో కానీ టిడిపి నాయకులు ఆ మధ్య ఇదంతా ప్రచారం మాత్రమే దీంట్లో నిజం లేదు అంటూ కొట్టిపారేశారు అయితే ఇప్పుడు చంద్రబాబు ఈ విషయాన్నీ నిజంగానే అమలు చేస్తున్నాడని రాజకీయ వర్గాలలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి.
అసలు విషయం ఏంటి ఎండకు బాబు బలయ్యకీ చెక్ పెట్టాలని అనుకుంటున్నారు అనే విషయంలోకి వెళ్తే.
బావమరిది ఉంటే ఎప్పటికైనా రాజకీయంగా పెద్ద మైనస్.
ఫ్యూచర్ లో తన కొడుకు బాలయ్య వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుదని అని భావించిన బాబు బాలకృష్ణ ని మెల్లగా సైడ్ ట్రాక్ పెట్టి తప్పించే యోచనలో ఉన్నారని టాక్.అందుకు తగ్గట్టుగానే బాబు స్కెచ్ వేసి దాన్ని అమలు చేస్తున్నారని కూడ టాక్.
అందులో భాగంగానే బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ వెనుకపడిందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది…అంతేకాదు దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి అసలు బాగోలేదని.ర్వేల్లో ఈ నియోజకవర్గాలు పూర్తిగా వెనుకపడిపోయాయని చంద్రబాబు అనేకసార్లు నేతలతో మాట్లాడుతూ హెచ్చరిచారు కూడా.
అయితే ఆ నియోజకవర్గాల లిస్టులో హిందూపురం కూడా ఉందని రూమర్ క్రియేట్ చేశారు టిడిపిలో.
అక్కడ పార్టీ కార్యక్రమాలు సవ్యగా జరగడం లేదని.
బాలయ్య కనీసం నెలకి ఒక సారి కూడా ఉండటం లేదని అందుబాటులో లేని కారణంగా అధికారులు కానీ మిగిలిన నాయకులు కానీ మాగోడు వినిపించుకోవడం లేదు అంటూ బాలకృష్ణ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు అనే మాటలు బయటకి వస్తున్నాయి.ఇవి మాటలు కూడా టిడిపి నుంచీ వస్తున్నాయి అని అంటున్నారు.
అయితే ఈ పరిణామాల నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో హిందూపురం ఎమ్మెల్యే టికెట్ బాలయ్యకు దక్కకపోవచ్చని అంటున్నారు ఈసారి హిందూపురం నుంచి లోకేశ్‌ను రంగంలోకి దించే ఆలోచనలో బాబు ఉన్నట్టుగా తెలుస్తోంది.ఒకవేళ ఇదే జరిగితే సింహం గర్జిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.







