Chandrababu naidu : నా అనుభవం ముందు అంటూ జగన్ పై చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం నువ్వా నేనా అన్నట్టుగా ఉంది.వైసీపీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ నాయకులు గెలుపు కోసం తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు.

2024 ఎన్నికలను వైఎస్ జగన్( YS Jagan ) మరియు చంద్రబాబు నాయుడు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చంద్రబాబు పొత్తులతో ముందడుగులు వేస్తున్నారు.

ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది.ఇదే సమయంలో బీజేపీని కూడా కలుపుకునే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు.

దాదాపు పొత్తులు కన్ఫర్మ్ అయినట్లు సీట్ల సర్దుబాటు గురించి చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Chandrababu Serious Comments On Jagan Saying Before My Experience
Advertisement
Chandrababu Serious Comments On Jagan Saying Before My Experience-Chandrababu N

పరిస్థితి ఇలా ఉంటే తాజాగా సీఎం జగన్ పై టీడీపీ చీఫ్ చంద్రబాబు( Chandrababu naidu ) సంచలన వ్యాఖ్యలు చేశారు.తన అనుభవం ముందు జగన్ ఒక బచ్చా అని తీవ్రంగా వ్యాఖ్యానించారు.అడ్డోస్తే తొక్కుకొనిపోవడానికి సిద్ధమని చెప్పారు.

ఎన్నికలకు ముందే రాష్ట్రంలో టీడీపీ విజయం ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు.అన్ని వర్గాలపై అక్రమ కేసులు పెట్టారని దుయ్యబట్టారు.

శనివారం పర్చూరులో "రా కదలిరా( Raa Kadali ra )" సభ నిర్వహించడం జరిగింది.ఈ సభకు భారీ ఎత్తున జనసేన మరియు తెలుగుదేశం పార్టీ నేతలు హాజరయ్యారు.

ఈ క్రమంలో పరుచూరు మీటింగ్ జరగకుండా వైసీపీ ఎన్నో అడ్డంకులు సృష్టించింది అంటూ ఆరోపించారు.మీటింగ్ కి భూమి ఇచ్చిన రైతులను భయభ్రాంతులకు కూడా గురి చేశారని ఆరోపించారు.

ఇది పోయే ప్రభుత్వం పోలీసులు కూడా జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు