ఏపీకి అమరావతి రాజధాని మాత్రమే కాదు అంటూ చంద్రబాబు సంచలన పోస్ట్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు( CM Chandrababu ) గురువారం రాజధాని అమరావతిలో పర్యటించారు.

ఈ క్రమంలో రాజధాని శంకుస్థాపన శిలాఫలకం నిలిచిపోయిన అనేక భవన నిర్మాణాలను పరిశీలించడం జరిగింది.

అనంతరం చంద్రబాబు అమరావతి( Amaravathi ) పర్యటనపై సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు."అమరావతి రాజధాని మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలకు ఉమ్మడి ప్రతిరూపం.

కానీ గత వైసీపీ ప్రభుత్వం ఈ ఆశలను చిదిమేసింది.రైతుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించింది.

రాజధానిని నాశనం చేశారు.ఈ పరిణామాలు నన్ను ఎంతగానో తీవ్ర ఆవేదనకు గురి చేశాయి.

Advertisement
Chandrababu Sensational Post Saying That Amaravati Is Not Only The Capital Of AP

ఇవ్వాల నేను అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అనేది అంచనా వేశాను.

Chandrababu Sensational Post Saying That Amaravati Is Not Only The Capital Of Ap

అమరావతి పునర్ నిర్మాణాన్ని ఇవ్వాల ప్రారంభించాం.అమరావతి రాజధాని అనేది దైవ నిర్ణయం.విధి ఎలా ఉంటే అలాగే జరుగుతుంది.అందుకే దైవ మహిమతో రాజధాని పనులు మళ్లీ మొదలయ్యాయి" అని చంద్రబాబు ట్వీట్ చేశారు.2014లో ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం తెలిసిందే.ఆ సమయంలో అమరావతిని రాజధానిగా ప్రకటించారు.

ఆ తర్వాత 2014లో వైసీపీ( YCP ) అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులన్నీ ప్రకటించడం జరిగింది.కానీ ఇటీవల జరిగిన ఎన్నికలలో అమరావతిని ఏకైక రాజధాని అని ప్రచారం చేస్తూ విజయం సాధించారు.

దీంతో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమరావతిని ఏపీకి ఏకైక రాజధాని అన్ని ప్రకటించి.పూర్తి చేయడానికి చంద్రబాబు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారు.

తేనెతో ఇలా చేశారంటే.. అందంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం..!
Advertisement

తాజా వార్తలు