జగన్ గురించి చంద్రబాబు... ప్రశాంత్ కిషోర్ ట్విట్ ! ఎందుకో తెలుసా...?

ఎప్పుడూ ఉప్పు.నిప్పులా ఒకరికి ఒకరు దుమ్మెత్తిపోసుకునే టీడీపీ అధినేత చంద్రబాబు.

వైసీపీ అధినేత జగన్ ఈ రోజు ఆప్యాయంగా పలకరించుకున్నారు.జగన్ ఆయురారోగ్యాలతో ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

అయితే .ఇదంతా స్వయంగా అయితే కాదు.ఈ రోజు జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని.

ట్విట్టర్ లో చంద్రబాబు అభినందనలు తెలిపారు.

Advertisement

వైఎస్‌ జగన్‌గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.ఆయన ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం ట్వీట్‌ చేశారు.శుభాకాంక్షలు తెలిపినందకు ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు అంటూ వైఎస్‌ జగన్‌ బదులిచ్చారు.

వైఎస్‌ జగన్‌ ఆయురారోగ్యాలతో, నిండునూరేళ్లు జీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అని మంత్రి గంటా శ్రీనివాసరావు ట్వీట్‌ చేశారు.

ఈ ఏడాది మీకు, ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలకు నిజంగా ప్రత్యేకమైందిగా ఉండబోతోందనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలనని జనతాదళ్ (యునైటెడ్) ప్రధాన కార్యదర్శి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ పేర్కొన్నారు.వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ లోక్ సభ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న సీపీఎం..!!

Advertisement

తాజా వార్తలు