ఎన్టీఆర్ పేరు వివాదం పక్కదారి ... బాబు పరువు పోయిందిగా  ?

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చుతూ ఏపీ అసెంబ్లీలో బిల్ పాస్ కావడం తో వివాదం మొదలైంది.

 Chandrababu Naidu Troubles With Ntr Health University Name Change Issue Details,-TeluguStop.com

ఈ వ్యవహారంలో వైసిపి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే విధంగా టిడిపి ప్రయత్నించగా, తిరిగి టిడిపి ఆత్మ రక్షణలో పడేవిధంగా వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది.ఎన్టీఆర్ గత చేదు అనుభవాలను వెలుగులోకి తీసుకొచ్చింది.

చంద్రబాబు కారణంగా ఎన్టీఆర్ ఎటువంటి మానసిక క్షోభకు గురయ్యారు అనే విషయాలను మీడియా , సోషల్ మీడియాలో హైలెట్ చేయడంలో వైసిపి సక్సెస్ అయ్యింది.
  అంతేకాకుండా ఈ విషయంలో ఎన్టీఆర్ కుమారులు సైతం ఇరుకున పడే విధంగా చంద్రబాబు వ్యవహారాన్ని హైలెట్ చేస్తూ .అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశం  తో పాటు,  గతంలో ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని,  వైస్రాయ్ హోటల్ లో జరిగిన వ్యవహారాన్ని,  అలాగే అప్పట్లో ఎన్టీఆర్ ను ఇబ్బంది పెట్టేలా చంద్రబాబు వ్యవహరించడం,  దానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మద్దతు పలకడం వంటి వ్యవహారాలను తెరపైకి తీసుకువచ్చి, ఈ విషయంలో టిడిపి ఇబ్బంది పడే విధంగా చేయడంలో సక్సెస్ అయింది.
 

Telugu Ap Cm, Balakrishna, Chandrababu, Jagan, Ntr, Ys Jagan, Ysr-Political

అంతేకాకుండా అప్పట్లో ఎన్టీఆర్ గురించి చంద్రబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, వాటి వార్తాపత్రికల క్లిప్పింగ్స్, వాల్ పోస్టర్స్ రూపంలో బయటకు తీసుకువచ్చి చంద్రబాబు వెన్నుపోటు అంశాన్ని హైలెట్ చేయడంలో సక్సెస్ అయ్యింది.అసలు ఎన్టీఆర్ టిడిపి లేనేలేదని, ఇప్పుడున్నదంతా చంద్రబాబు టీడీపీ అంటూ వైసిపి ఎదురు దాడి మొదలు పెట్టింది.ఈ విషయంలో చంద్రబాబు తో పాటు , బాలకృష్ణ సైతం నోరు మెదప లేని పరిస్థితి ఏర్పడింది.

అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశం ను ప్రస్తావించడానికి టిడిపి భయపడే విధంగా చేయడంలో వైసిపి ప్లాన్ సక్సెస్ అయ్యింది. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube