మండలి రద్దుపై జనసేన ఎమ్మెల్యే వైఖరి ఇదే

నేడు అసెంబ్లీలో జరిగిన శాసన మండలి రద్దు చర్చలో జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్‌ పాల్గొన్నాడు.

ఈ సందర్బంగా ఆయన శాసనసభకు పైన ఒక సభ ఉండటం ఏమాత్రం కరెక్ట్‌ కాదు.

ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు చేసిన తీర్మానాలు చట్టాలు ఖచ్చితంగా అమలు అవ్వాలి.వాటిని మళ్లీ మండలికి పంపించి చర్చించడం ఎందుకు అంటూ రాపాక ప్రశ్నించాడు.

Chandrababu Naidu Sasana Mandali Raddu-మండలి రద్దుపై �

జనసేన పార్టీ మండలి రద్దును సమర్ధిస్తున్నట్లుగా ప్రకటించాడు.జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ మాత్రం మండలి రద్దు విషయమై ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.

అసెంబ్లీలో మండలి రద్దు చర్చ జరుగుతున్న సమయంలో తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు సభ నుండి వాకౌట్‌ చేయగా, రాపాక మాత్రం సభలో ఉండి చర్చలు పాల్గొన్నాడు.సీఎం తీసుకు వచ్చిన వికేంద్రీకరణ బిల్లును మండలి అడ్డుకోవడం దారుణం.

Advertisement

అలాంటప్పుడు మండలిని రద్దు చేయడంను నేను సమర్ధిస్తున్నట్లుగా ఈ సందర్బంగా రాపాక అన్నాడు.

ప్రభాస్ సలార్ 2 సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా..?
Advertisement

తాజా వార్తలు