వారిద్దరూ ... కలుస్తారని బాబు కి భయం వేస్తోందా ..?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి కూడా భయం పట్టుకున్నట్టుగా కనిపిస్తోంది.తెలంగాణాలో మహాకూటమి ఏర్పాటుతో .

అక్కడ టీడీపీ కి ఢోకా లేకుండా పోయింది.ఇక ఇప్పుడు బాబు బెంగంతా.

ఏపీ పైనే ఉంది.ఏపీలో టీడీపీకి ఢోకా లేదు అనుకుంటున్నా సమయంలో జనసేన పార్టీ అనూహ్యంగా పుంజుకోవడం.

అలాగే ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కూడా రాజకీయంగా మెరుగైన పరిస్థితులు ఏర్పరుచుకోవడం బాబుకి రుచించడంలేదు.ఎలాగూ.

Advertisement

ఏపీలో త్రిముఖ పోరు తీవ్రంగా ఉండేలా కనిపిస్తుండగానే .జనసేన - వైసీపీ పార్టీలు ఏపీలో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది అనే వార్తలు బాబు కి నిద్రపట్టనీయడం లేదు.

కొద్ది రోజుల క్రితం .ఏపీ టీడీపీ అధ్యక్షుడు, మంత్రి కమిడి కళా వెంకట్రావు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి రాసిన లేఖలో ఆ విషయం స్పష్టంగా కనిపిస్తోంది.తన లేఖలో విశాఖపట్నంలో జగన్ తో భేటీ అయ్యింది వాస్తవం కాదా ? అసెంబ్లీ ఎన్నికల్లో మీకు 40 సీట్లు జగన్ ఆఫర్ చేసింది నిజమేనా ? అంటూ ప్రస్తావించారు.జగన్, పవన్ ఇద్దరిలో ఎవరిని ఎవరు కలిస్తే టీడీపీకి ఎందుకు అంత బాధో ఎవరికీ అంతుపట్టలేదు.

అసలు టీడీపీ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటుందని సగటు టీడీపీ కార్యకర్త నుంచి బాబు కోటరీ నాయకుల వరకు ఎవరూ ఉహించలేదు.

కానీ ఆ రెండు పార్టీలు పొత్తులు పెట్టేసుకున్నాయి.అంతెందుకు ఇప్పడు టీడీపీ దుమ్మెత్తి పోస్తున్న జనసేన - బీజేపీ పార్టీలతో మొన్నటివరకు టీడీపీ అంటకాగింది.గత ఎన్నికల్లో వైసీపీని ఒంటరిగా ఎదుర్కోవడం కష్టమనే భావనకు వచ్చిన టీడీపీ సరిగ్గా అప్పటికే దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ హవా ఉండడంతో ఆ పార్టీతో పొత్తు పెట్టేసుకుంది.

కేంద్రం కీలక నిర్ణయం..బంగారం,వెండిపై సుంకాలు డబుల్
బండి సంజయ్ మైనర్ బాలికను బెదిరించాడా లేదా...?

ఇక అప్పటికే జనసేన అధినేత పవన్ ను లైన్ లో పెట్టేసుకుని మరీ అధికారంలోకి వచ్చేసింది.ఇక వచ్చే ఎన్నికల్లో కూడా ఏపీలో అధికారం దక్కించుకోవాలని కలలు కంటున్న టీడీపీకి జనసేన వైసీపీ కలవబోతున్నారు అని వస్తున్న వార్తలు మరింత కలవరం పుట్టిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు