ఏపీ సీఎం జగన్ పై చంద్రబాబు హాట్ కామెంట్స్

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.జగన్ వి నవరత్నాలు కాదన్న ఆయన నవ మోసాలంటూ విమర్శలు గుప్పించారు.

జగన్ ఫొటో ఉండాల్సింది ఇంటి తలుపులపై కాదన్న చంద్రబాబు పోలీస్ స్టేషన్ లో ఉండాలని మండిపడ్డారు.ప్రత్యేకంగా ఎస్సీల కోసం ఒక్క బటన్ అయినా జగన్ నొక్కారా అని ప్రశ్నించారు.

ప్రభుత్వ సలహాదారులుగా దళితులను ఎందుకు నియమించలేదో చెప్పాలన్నారు.వీపీలుగా దళితులు పనికిరారా అని ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో దళితద్రోహి జగన్ అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని తెలిపారు.

Advertisement
Lorem Ipsum Dolor Sit Amet