ఏపీలోని విద్యారంగంలో కీలక సంస్కరణలు తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు.నాడు -నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చామని చెప్పారు.
ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినందుకు చంద్రబాబుతో పాటు చాలా మందితో యుద్ధం చేస్తున్నామని తెలిపారు.వాళ్ల పిల్లలు ఇంగ్లీష్ మీడియం( English medium )లోనే చదవాలంట అన్న సీఎం జగన్( CM Jagan ) పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే మాత్రం తెలుగు భాష అంతరించిపోతోందని గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు.
పెత్తందార్లకు ఓ ధర్మం.పేదలకు మరో ధర్మమా అని ప్రశ్నించారు.విద్యారంగంలో క్లాస్ వార్ జరుగుతోందన్నారు.చంద్రబాబు( Chandrababu )పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క పథకం కూడా లేదన్నారు.ప్రభుత్వ బడులను చంద్రబాబు నాశనం చేశారని ఆరోపించారు.జగన్ పక్కకు తప్పుకుంటే జరిగే నష్టం ఏంటో అందరూ ఆలోచించాలని సూచించారు.
మీకు మంచి జరిగి ఉంటే తప్పకుండా తనకు తోడుగా నిలబడాలని కోరారు.