ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి..!!

ఏపీలో ఈసారి ఎన్నికలను చంద్రబాబు( Chandrababu ) చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.2019లో అధికారం కోల్పోవడంతో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తున్నారు.

ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జాగ్రత్త పడటం జరిగింది.ఇందుకోసం బీజేపీ, జనసేన( BJP , Jana Sena ) పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం జరిగింది.2014లో మాదిరిగా విజయం సాధించాలని చంద్రబాబు వ్యవహాత్మకంగా అడుగులు వేయడం జరిగింది.అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా పర్యటనలు చేశారు.

ఎన్నికల ప్రచారం చివరికి వచ్చేసరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తో ఉభయ గోదావరి జిల్లాలలో అనేక వేదికలను పంచుకున్నారు.ఎట్టి పరిస్థితులలో రెండోసారి వైసీపీ గెలవకూడదని సంచలన స్పీచ్ లు ఇచ్చారు.

Chandrababu Appeals To Everyone To Exercise Their Right To Vote , Chandrababu, A

చివరిలో బీజేపీ అగ్రనేతులతో కలిసి బహిరంగ సభలలో పర్యటించడం జరిగింది.ఇదిలా ఉంటే సోమవారం పోలింగ్ నేపథ్యంలో సోషల్ మీడియాలో చంద్రబాబు సంచలన పోస్ట్ పెట్టారు."ప్రజా చైతన్యం వెల్లివిరియాలి.

రాష్ట్ర భవిష్యత్ ను మార్చేందుకు మీ ఓటే కీలకం.మీతో పాటు మరో నలుగురు కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా వారిని ప్రోత్సహించండి.

Advertisement
Chandrababu Appeals To Everyone To Exercise Their Right To Vote , Chandrababu, A

మీ భవిష్యత్తును, మీ రాష్ట్ర భవిష్యత్తును మార్చేది మీరు వేసే ఓటే.నిర్భయంగా, నిజాయతీగా, స్వేచ్ఛగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాను" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు