పాపం బాబు.. ఇన్ని కేసులా ?

ఏపీ లో టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Arrest ) పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది.40 ఏళ్ళే రాజకీయ చరిత్రలో ఎప్పుడు జైలు మెట్లు ఎక్కని చంద్రబాబుకి తన రాజకీయ చివరిరోజుల్లో ఊహించని కేసులు ఆయన చుట్టూ ముడుతున్నాయి.

మచ్చలేని నాయకుడిగా రాజకీయాల నుంచి విరామం తీసుకోవాలని భావించినప్పటీకి ఆ కోరిక నెరవేరలే కనిపించడం లేదు.

ప్రస్తుతం స్కిల్ స్కామ్ లో ఏ 37 ముద్దాయిగా జైల్లో ఉన్న చంద్రబాబుకు మరిన్ని కేసులు చుట్టుముడుతున్నాయి.ఇప్పటికే స్కిల్ స్కామ్ కేసుపై కోర్టులో వాయిదాల పర్వం కొనసాగుతోంది.

దీంతో ఎప్పుడు బెయిల్ వస్తుందో, జైలు నుంచి ఎప్పుడు బయటకు వస్తారో కూడా చెప్పలేని పరిస్థితి.ఏ నేపథ్యం మరికొన్ని స్కామ్ లు ఆయనను చుట్టూ ముడుతుండడంతో అసలు చంద్రబాబు విషయంలో ఏం జరుగుతుందో అర్థంకానీ పరిస్థితులు నెలకొంటున్నాయి.గత ప్రభుత్వ హయంలో ఫైబర్ నెట్ ప్రాజెక్ట్( Fiber Net Project ) లో అవకతవకలు జరిగాయని తాజాగా తాజాగా మరో పిటిషన్ వేసింది ఏపీ సీఐడీ.

బ్లాక్ లిస్ట్ లో ఉన్న టేరా స్టాప్ సంస్థకు నిబందనలకు విరుద్దంగా టెండర్లు జారీ చేశారని ఇందులో ప్రధానంగా వేమూరి హరిప్రసాద్ పై ఆరోపణలు వినిపిస్తోంది సీఐడీ.

Advertisement

ఈయన చంద్రబాబుకు మిత్రుడు కావడంతో ఈ ఫైబర్ స్కామ్ కూడా చంద్రబాబు మెడకే చుట్టుకుంటోంది.అయితే ఈ స్కామ్ లో లోకేశ్ పేరు కూడా వినిపిస్తోంది.ఇక ఇవే కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా చంద్రబాబు పేరును ప్రస్తావిస్తోంది సీఐడీ.

ఈ కేసుపై 21 ఏసీబీ కోర్టు విచారించనుంది.అలాగే క్యాష్ పిటిషన్ పై తీర్పును హోల్డ్ లో ఉంచింది హైకోర్టు.

ఇలా చంద్రబాబు కలలో కూడా ఉంచించని స్కామ్ లు ప్రస్తుతం ఆయనను చుట్టుముట్టాయి.దీంతో అసలు చంద్రబాబు ఈ స్థాయిలో అవినీతి చేశారా ? లేదా జగన్ ప్రభుత్వం( YS Jagan Mohan Reddy ) కక్ష పూరితంగానే ఇన్ని కేసులు మోపుతోందా ? అనేది విశ్లేషకులకు సైతం అంతు చిక్కడంలేదు.మరి వీటన్నిటిని దాటుకొని చంద్రబాబు తనను తాను ఎలా నిరూపించుకుంటారో చూడాలి.

పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...
Advertisement

తాజా వార్తలు