ప్రత్యర్థులు అనుకోకుండా ఎదురుపడి మాట్లాడుకుంటే చూడ్డానికి కన్నుల పండువగా అనిపిస్తుంది.ఇక పార్టీ అభిమానులు కూడా ఖుషీ అవుతారు.
అలాంటి సంఘటనలు ఎప్పుడు జరుగుతయా అన్నట్లు ఎదురు చూస్తారు.ఒకే వేదికపై ఇద్దరు పార్టీల అధినేతలు కలవాల్సి వస్తే ఇద్దరు ఎలా రియాక్ట్ అవుతారో అనే ఆసక్తి ఉంటుంది.
వాళ్లు పలకరించుకుని కాసేపు మాట్లాడుకుంటే ఆ ఆనందమే వేరు.కానీ అందుకు భిన్నంగా ఎవరి పని వారు చూసుకుని వెళ్లి పోతే తీవ్ర నిరాశకు గురవుతారు.
ఇప్పుడు ఏపీలో అదే సంఘటన చోటు చేసుకుంది.టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ ఓ కార్యక్రమానికి హాజరై పలకరించుకోకుండా అందరినీ నిరాశపరచారు.
విజయవాడలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన ఎట్ హోం కి ఇద్దరు నేతలూ హాజరయ్యారు.కానీ ఇద్దరు ఎదురుపడలేదు పలకరించుకోలేదు.
చెరోపక్క కూర్చుని.

ఒకరి తరువాత ఒకరు వచ్చారు.ఎవరికి వారుగా తమ తమ టేబుల్స్ వద్ద కూర్చున్నారు.దాంతో ఎట్ హోం లో రాజకీయ మ్యాజిక్ జరుగుతుందని ఆశించిన వారికి పూర్తి నిరాశే మిగిలింది.
నిజానికి పవన్ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సి ఉంది.కానీ ఎందుకో రాలేదు.
ఇక ముఖ్యమంత్రి జగన్ సతీసమేతంగా ఈ కర్యక్రమానికి హాజరయ్యారు.ఆయన గవర్నర్ దంపతుల పక్కన ప్రధాన టేబుల్ వద్ద కూర్చుకున్నారు.
అదే టేబుల్ వద్ద హై కోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కూడా ఉన్నారు.ఇక దానికి కాస్తా ఎడమ పక్కన ఉన్న టేబుల్ వద్ద చంద్రబాబు, టీడీపీ స్టేట్ చీఫ్ అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్, ఎంపీ కేశినేని నాని కూర్చున్నారు.
ఏదో అనుకుంటే…

అయితే కార్యక్రమంలో ఇద్దరు నేతలు ఎదురుపడతారని.పలకరించుకుంటారని అనుకున్న వాళ్లను పూర్తిగా నిరాశపరిచారు.బాబు జగన్ ఒకరికి ఒకరు ఎదురుపడతారని వారిద్దరూ కాసేపు ముచ్చటించుకుంటారని అంతా ఏవేవో ఊహించుకున్నారు.కానీ చివరికి ఇద్దరు నేతలూ ఎవరి పని వాళ్లు చూసుకుని వెళ్లిపోయారు.
ఇక కనీసం పవన్ మెరుపులు అయినా ఉంటాయనుకుంటే ఆయన ఎలాగూ కార్యక్రమానికే హాజరే కాలేదు.మొత్తానికి ఎట్ హోం కార్యక్రమం ఏపీ ప్రజలకు నిరాశే మిగిల్చిందని చెప్పాలి.