మీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యే ముందు కనిపించే సంకేతాలు ఇవే..!

ఆచార్య చాణక్యుడు( Acharya Chanakya ) మన జీవితాలకు సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేశాడు.

దీనికి సంబంధించి తన నీతి శాస్త్రంలో కూడా ఎన్నో విషయాలను లిఖించాడు.

ఆయన చెప్పే ప్రతి ఒక్క విషయం జీవితంలో లక్ష్యాలను సాధించేందుకు మనకు స్ఫూర్తిని ఇస్తూ ఉంటుంది.అందుకే ఆయన చెప్పిన మాటలను ప్రస్తుత సమాజంలో చాలామంది పాటిస్తున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే చాణక్య నీతిలో మనిషి తనకు బ్యాడ్ టైం( Bad Time ) స్టార్ట్ అవ్వడాన్ని ముందుగానే ఎలా గ్రహించాలో తెలియజేశారు.ఇంట్లో లేదా చుట్టుపక్కల జరిగే కొన్ని సంఘటనలపై శ్రద్ధ వహిస్తే మనకు చెడుకాలం రాబోతుందని అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉండవచ్చు.

Chanakya Neeti Signs In The House That Tells That Bad Time Started Details, Chan

ఇంట్లో వచ్చే ఆర్థిక సంక్షోభం ఎలాంటి సంకేతాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా చెప్పాలంటే మన అందరి ఇళ్లలో తులసి మొక్కను( Tulsi Plant ) పెంచుతూ ఉంటాము.అలాగే పూజలు కూడా చేస్తూ ఉంటాము.

Advertisement
Chanakya Neeti Signs In The House That Tells That Bad Time Started Details, Chan

అయితే మీకు బ్యాక్ టైమ్ స్టార్ట్ అవుతుందని మీ ఇంటి తులసి మొక్క కూడా సంకేతం ఇస్తుందని ఆచార్య చాణక్యుడు తెలియజేశాడు.మీ ఇంటిలో తులసి మొక్క ఎండిపోతే మీరు ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

కాబట్టి తులసి మొక్కను జాగ్రత్తగా చూసుకోవాలి.అంతేకాకుండా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటే అలాంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవి( Lakshmi Devi ) మీ ఇంట్లో ఉండదని చాణక్య నీతి చెబుతుంది.

Chanakya Neeti Signs In The House That Tells That Bad Time Started Details, Chan

దీని కారణంగా మీ ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది.అందుకే సాధ్యమైనంత వరకు ఇంట్లో గొడవలు( Family Disputes ) రాకుండా చూసుకోవడం మంచిది.ఆచార్య చాణక్య ప్రకారం ఏదైనా గాజు వస్తువులు పదే పదే పగిలిపోతున్న ఆ ఇంట్లో ఆర్థిక పరిస్థితి ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇంకా చెప్పాలంటే ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కోసం క్రమం తప్పకుండా పూజలు చేయడం ఎంతో అవసరం.లక్ష్మీదేవిని రోజు పూజించే ఇంట్లో ఆమె అనుగ్రహం కచ్చితంగా ఉంటుంది.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి30, ఆదివారం 2025

మరోవైపు పూజలు లేని ఇంట్లో అమ్మ లక్ష్మీదేవి అసలు ఉండదు.

Advertisement

తాజా వార్తలు