చంటి ఎగైన్ బ్యాక్ టు జబర్దస్త్..!

జబర్దస్త్ నుంచి చలాకి చంటి బిగ్ బాస్ కి వెళ్లాడు.అక్కడ పెద్దగా అలరించకుండానే ఎలిమినేట్ అయ్యాడు.

సీజన్ 6 లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టంట్ అనుకున్న చంటి ఐదు వారాలకే వెను తిరగడం ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది.చలాకి చంటికి హౌస్ సూట్ అవలేదనే కామెంట్స్ తెలిసినవే.

Chalaki Chanti Again Back To Jabardasth,Jabardasth,Chalaki Chanti,Comedian Chant

ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ కోసం వెళ్లిన చలాకి చంటి స్టార్ మా రూల్స్ ప్రకారం ఏడాది పాటు అక్కడ ఉన్నాడు.ఇక అక్కడ అగ్రిమెంట్ పూర్తి అవడంతో చంటి తిరిగి జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

చలాకి చంటి తిరిగి జబర్దస్త్ కి రావడం ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది.చంటి జబర్దస్త్ ని వదిలి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడం ఇది తొలిసారి కాదుఇ.

Advertisement

ఇదివరకు రెండు మూడు సార్లు అతను వెళ్లడం మళ్లీ తిరిగి రావడం జరిగింది.అయితే జబర్దస్త్ నుంచి బిగ్ బాస్ కి వెళ్లిన జబర్దస్త్ కమెడియన్స్ లో చలాకి చంటి మాత్రమే మళ్లీ తిరిగి జబర్దస్త్ లోకి వచ్చాడు.

మిగతా వారంతా స్టార్ మాలోనే ఉండిపోయారు.చంటితో పాటుగా జబర్దస్త్ కి వచ్చిన గీతు రాయల్ ఫైమా కూడా వెళ్లారు.

వారిద్దరు ఆ షోతో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.చలాకి చంటి మాత్రం తన జబర్దస్త్ ఇమేజ్ ని బిగ్ బాస్ లో సరిగా వాడుకోలేదు.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు