కేంద్రంపై తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.కేంద్రం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని విమర్శించారు.
పార్లమెంటరీ వ్యవస్థకు విఘాతం కలిగించేలా వ్యవహరించడం సరికాదని గుత్తా తెలిపారు.విమర్శించిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటే ఏ పార్టీ మిగలదని చెప్పారు.
జీఎస్టీ పేరుతో రాష్ట్రాల అధికారాలను కేంద్రం హరిస్తోందని ఆరోపించారు.అంతేకాకుండా గవర్నర్ వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని వెల్లడించారు.
ఇప్పటికైనా కేంద్రం అప్రజాస్వామిక విధానాలను విడనాడాలని తెలిపారు.







