షూటింగ్ లకు పర్మిషన్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

కరోనా కారణంగా ఆగిపోయిన సినిమా సీరియల్ షూటింగ్ లన్నీ ఇప్పుడు మళ్లీ మొదలవుతున్నాయి.

కానీ వీటికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు తప్పక పాటించాలని తాజాగా కేంద్ర సమాచార ప్రసారాల శాఖా మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు.

దేశంలో మెజారిటీ ప్రజలను ప్రభావితం చేసే రంగాలలో ఒకటిగా ఉన్న సినీ ఇండస్ట్రీ ఇన్నాళ్లు ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది.వీటిని దృష్టిలో ఉంచుకొని తాజాగా కొన్ని నిబంధనలతో కూడిన అనుమతులు ఇస్తున్నట్లు ప్రకటించారు.

Central Government Issued Guidelines For Shootings, Central Government, Guidelin

ఇంతకీ ఆ నిబంధనలేంటో ఇప్పుడు చూద్దాం.

  • చిత్రీకరణ సమయంలో షూటింగ్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలి.

  • నటీనటులు సాంకేతిక నిపుణులు అందరూ ఆరోగ్య సేతు యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి.
  • తక్కువ సిబ్బందితో షూటింగ్ నిర్వహించాలి
  • షూటింగ్ జరుగుతున్న సమయంలో విజిటర్ లకు అనుమతులు ఇవ్వకూడదు
  • మేకప్ ఆర్టిస్టులు తప్పకుండా పీపీఈ కిట్లను ధరించాలి
  • షూటింగ్ ప్రాంతాలలో తరచుగా శానిటైజ్ చేయాలి
  • కెమెరాలను వినియోగించే సమయంలో సాంకేతిక నిపుణులు గ్లౌజులు ధరించాలి.

    Advertisement

  • లోపలకు బయటకు వెళ్లడానికి వేరువేరు దారులు ఉండాలి.అలాగే లోపలికి ప్రవేశించే మార్గాల్లో థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేయాలి.

  • షూటింగ్లో వినియోగించే వస్త్రాలు విగ్గులు ఇతరులతో పంచుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • షూటింగ్ చేయాలి అని నిర్ణయించుకున్న వారు తప్పకుండా ఈ మార్గదర్శకాలను పాటించాలని కేంద్ర సమాచార ప్రసారాల శాఖా మంత్రి ప్రకాష్ జవదేకర్ సినీ ప్రముఖులను కోరారు.

.

13 ఏళ్లకే పెళ్లి మాటెత్తిన డబ్బింగ్ జానకి.. ఆమె లవ్ స్టోరీతో సినిమా తీయొచ్చు..?
Advertisement

తాజా వార్తలు