దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.అన్ని రాష్ట్రాల్లోని గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.అన్ని స్థానిక సంస్థలకు మొత్తంగా రూ.15,705.65 కోట్లను విడుదల చేసింది.
ఇందులో తెలంగాణకు రూ.273 కోట్లు, ఏపీకి రూ.948.35 కోట్లు విడుదల అయ్యాయి.ఈ నిధుల్లో పెద్ద రాష్ట్రమైన యూపీకు రూ.3,733 కోట్లు, బీహార్ కు రూ.1,921 కోట్లతో పాటు మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు వెయ్యి కోట్లకు పైగా నిధులు విడుదల అయ్యాయి.







