కరెన్సీ నోట్లపై ఒక క్రీడాకారుడి ఫోటో అంటే మనం వూహించుకోలేమో గాని, అర్జెంటీనా ఎప్పుడో ఊహించింది.అవును, తన అభిమానులు వూహించనట్టుగానే మెస్సీ ఫొటో తమ దేశపు కరెన్సీపైన ముద్రించాలని అర్జెంటీనా సంచలన నిర్ణయం తీసుకుందని వార్తలు ఇపుడు సోషల్ మీడియాలోనే కాకుండా అంతటా వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే అక్కడి సెంట్రల్ బ్యాంక్ ఈ ప్రతిపాదన చేయడం గమనార్హం.ఫుట్‌బాల్ అంటే ప్రాణమిచ్చే సౌత్ అమెరికన్ దేశాలలో అర్జెంటీనా ప్రధమ స్థానంలో ఉంటుంది.
తాజాగా ముగిసిన ఫిఫా వరల్డ్‌కప్‌ను అర్జెంటీనా గెలిచి, కోట్లాది మంది అభిమానులను ఆనందంలో ముంచింది.ఆ ట్రోఫీతో స్వదేశంలో అడుగుపెట్టిన మెస్సీ సేనకు ఇక ఘన స్వాగతం లభించింది.
ఎంతగా అంటే మీరు వూహించలేరేమో! వాళ్ళని పలకడానికి ఏకంగా 40 లక్షల మంది రోడ్లపైకి వచ్చారు అంటే నమ్మశక్యం కాదేమో.అంతలా అక్కడ ఫుట్‌బాల్‌ను, మెస్సీని ప్రజలు ఆరాధిస్తారు.
ఇప్పుడు అర్జెంటీనాకు 36 ఏళ్ల తర్వాత మరోసారి వరల్డ్‌కప్ ట్రోఫీ అందించిన మెస్సీని ఏకంగా అక్కడి కరెన్సీ నోట్లపైనే ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈపాటికే అర్జెంటీనా సెంట్రల్ బ్యాంక్ 1000 పెసో బ్యాంక్‌నోట్‌పై మెస్సీ ఫొటోను ముద్రించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచిందని సమాచారం.నిజానికి ఖతార్‌లో ఆ ఫైనల్ మ్యాచ్ జరగడానికి ముందే అర్జెంటీనా సెంట్రల్ బ్యాంక్ అధికారులు ఆ దిశగా పనులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.ఇక 1000 పెసో నోటే ఎందుకు అంటే.
మెస్సీ జెర్సీ నంబర్ 10కి ఇది మ్యాచ్ అవుతుంది కాబట్టి.నిజానికి 1978లో తొలిసారి ఫిఫా వరల్డ్‌కప్‌ను గెలిచినప్పుడు దానిని సెలబ్రేట్ చేసుకోవడానికి అర్జెంటీనా కొన్ని స్మారక నాణేలాను రిలీజ్ చేసింది.
ఇక ఇప్పుడు కరెన్సీ నోటుకు ఓవైపు మెస్సీ, మరోవైపు అర్జెంటీనా కోచ్ లియో స్కలోనీ ఫొటోలను ముద్రించాలన్న ప్రతిపాదన రావడం విశేషం.







