అమెరికాలో పెరుగుతున్న కరోనా కేసులు .. ఈ రాష్ట్రాల్లో మాస్క్ తప్పనిసరి నిబంధన అమల్లోకి

2019 చివరిలో చైనా( China )లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

గడిచిన నాలుగేళ్ల కాలంలో కోట్లాది మంది ప్రజలు దీని బారినపడగా .

లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు.కంటికి కనిపించని ఓ సూక్ష్మజీవి తనకంటే ఎన్నో రెట్లు శక్తివంతుడైన మనిషిని నాలుగు గోడల మధ్య బందీని చేసింది.

నలుగురిలోకి వెళ్లాలంటే భయం.తోటి వ్యక్తి తుమ్మితే టెన్షన్.ఆర్ధిక వ్యవస్ధ చిన్నాభిన్నం కాగా.

లక్షలాది మంది రోడ్డునపడ్డారు.ఇలా ఒకటి కాదు.

Advertisement

రెండు కాదు ఈ మహమ్మారి వల్ల ఎన్నో దారుణాలు.అయితే వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో కోవిడ్ తీవ్రత తగ్గింది.

అయినప్పటికీ కొత్త కొత్త వేరియంట్లు మానవాళిపై దాడి చేస్తూనే వున్నాయి.శాస్త్రవేత్తలు సైతం కరోనా ముప్పు ఇంకా తప్పిపోలేదని హెచ్చరిస్తూనే వున్నారు.

శీతాకాలం కావడంతో చాలా దేశాలలో కోవిడ్ కేసులు( covid cases ) అనూహ్యంగా పెరుగుతున్నాయి.భారత్‌లోనూ జేఎన్.1 వేరియంట్( JN 1 Variant ) బారినపడి ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.అటు అగ్రరాజ్యం అమెరికాలోని పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి చెందుతోంది.

యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సైతం అప్రమత్తమైంది.మిడ్‌వెస్ట్ , ఈశాన్య ప్రాంతాలు కోవిడ్ 19 ఇన్‌ఫెక్షన్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

ఆక‌లిగా లేదని భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..!
'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 

కాలిఫోర్నియా, ఇల్లినాయిస్, మసాచుసెట్స్, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీలలోని ఆసుపత్రుల్లో ఫ్లూ, శ్వాసకోశ అనారోగ్య కేసులు పెరుగుతున్నందున మాస్క్ తప్పనిసరి నిబంధనలను అమల్లోకి తెచ్చాయి.

Advertisement

డిసెంబర్ 23 నాటి వారంలో 18.3 శాతం పాజిటివ్ కోవిడ్ 19 పరీక్షలతో అయోవా, మిస్సోరి, కాన్సాస్( Kansas ), నెబ్రాస్కాతో కూడిన రీజియన్ సెవెన్ అగ్రస్థానంలో వుంది.ఇల్లినాయిస్, ఇండియానా, మిచిగాన్, మిన్నెసోటా, ఒహియో, విస్కాన్సిన్‌లు రీజియన్ ఫైవ్ కేటగిరీలో వున్నాయి.ఇక్కడ కోవిడ్ పాజిటివ్ రేట్లు 0.1 శాతానికి తగ్గాయి.మసాచుసెట్స్‌లోని మాస్ జనరల్ బ్రిగమ్ వంటి ఆరోగ్య సంరక్షణ వ్యవస్ధలు కోవిడ్ 19 పాజిటివ్ రేటు తగ్గే వరకు రోగితో ప్రత్యక్షంగా కాంటాక్ట్‌లో వుండే సిబ్బందికి మాస్క్ తప్పనిసరి నిబంధనను అమలు చేస్తున్నాయి.

వాషింగ్టన్ డీసీలోని మెడ్‌స్టార్ నేషనల్ రిహాబిలిటేషన్ హాస్పిటల్, ఎన్‌వైసీ హెల్త్ ప్లస్ హాస్పిటల్స్‌లో ఇలాంటి చర్యలు అమల్లో వున్నాయి.ఇల్లినాయిస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఐడీపీహెచ్) ఉపశమన ప్రయత్నాలను తీవ్రతరం చేయడానికి ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను సూచించింది.

కాలిఫోర్నియాలోని యోలో కౌంటీ సైతం కోవిడ్ 19, శ్వాసకోశ వైరస్ స్థాయిలు రద్దీగా వుండే ఇండోర్ ప్రదేశాలలో మాస్క్‌లను ఉపయోగించాల్సిందిగా సూచించాయి.

తాజా వార్తలు