చిన్నారులకు ఈ వంటకాన్ని తినిపించడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

పుట్టిన పసిపిల్లలకు ఆరు నెలల వరకు తల్లి పాలు శ్రేయస్కరం.6 నెలల తర్వాత పిల్లలకు కొద్ది మొత్తంలో ఆహారం అలవాటు చేయాలి.

మనం పెట్టే ఆహారం ఏదైనా కానీ చాలా మెత్తగా చేసి పెట్టడం ద్వారా వారిలో ఎటువంటి జీర్ణక్రియ సమస్యలు తలెత్తవు.

అందులో కచ్చితంగా ఈ పప్పు చారు అన్నం పెట్టాలి.ఈ పప్పు చారు పెట్టడం ద్వారా పిల్లలలో కలిగే లాభాలేమిటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.పిల్లలకు పప్పు చారు అన్నం తినిపించడం ద్వారా తేలికగా జీర్ణం కావడంతో పాటు, మంచి శక్తిని కలిగిస్తుంది.

ఇందులో ఉన్న విటమిన్లు, పీచు పదార్థాలు, ప్రొటీన్లు పిల్లల పెరుగుదలకు దోహదపడతాయి.అంతే కాకుండా శారీరక పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి.

కొద్దిగా పెసర పప్పు అన్నం బాగా మెత్తగా ఉడికించి పిల్లలకు తినిపించడం ద్వారా తేలికగా జీర్ణం అవ్వడమే కాకుండా మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది.పెసర పప్పును తరచూ పిల్లలకు తినిపించడం ద్వారా రక్తం బాగా వృద్ధి చెందుతుంది.

Best Food For Children In Telugu Healthy Food, Cashew Nuts, Badam Powder, Pappu
Advertisement
Best Food For Children In Telugu Healthy Food, Cashew Nuts, Badam Powder, Pappu

చిరుధాన్యాల మిశ్రమం అనగా రాగులు, కందిపప్పు, బాదం, జీడిపప్పు వీటన్నింటినీ కొద్దిగా వేయించి చల్లారిన తర్వాత అన్నింటినీ కలిపి పొడి కొట్టాలి.ఈ పొడిలో కొద్దిగా పాలు లేదా నీళ్లు కలుపుకొని పిల్లలకు ఉదయం, సాయంత్రం జావాలాగ తాగించాలి.ఇలా చేయడం ద్వారా పిల్లలు శారీరకంగా, మానసికంగా పెరుగుదల కనిపిస్తుంది.

అంతేకాకుండా వారిలో రోగ నిరోధక శక్తిని పెంపొందించి, జ్ఞాపకశక్తి కూడా మెరుగు పడుతుంది.

Best Food For Children In Telugu Healthy Food, Cashew Nuts, Badam Powder, Pappu

ఎంతోమంది పిల్లలు ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడరు.అలాంటి పిల్లలకు కాస్త కష్టమైన సరే ఆహారాన్ని తినిపించి బలాన్ని పెంచాలి.పప్పు తినకపోయినా ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే బాదం పౌడర్, జీడిపప్పు పౌడర్ బాగా తింటారు.

అలాంటివి ఉదయం, రాత్రి పెడితే ఆరోగ్యంగా బలంగా తయారవుతారు.

మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి
Advertisement

తాజా వార్తలు