పార్టీలకు నగదు విరాళాలు పరిమితం చేయాలి: సీఈసీ లేఖ

కేంద్ర న్యాయశాఖకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది.రాజకీయ పార్టీలకు నగదు విరాళాలు పరిమితం చేయాలని కోరింది.

అజ్ఞాత వ్యక్తుల నుంచి పార్టీలు నగదు రూపేణా స్వీకరించే విరాళాల పరిమితిని రూ.20 వేల నుంచి రూ.2 వేలకు తగ్గించాలనే యోచనలో ఉంది.ఈ క్రమంలో మొత్తం విరాళాల్లో నగదు రూపంలో స్వీకరించింది 20 శాతం లేదా రూ.20 కోట్లకు పరిమితం చేయాలనే నిబంధన విధించాలని లేఖలో ప్రతిపాదించింది.రాజకీయ పార్టీలు స్వీకరించే ఎన్నికల విరాళాలు, అభ్యర్థులు ఖర్చుల్లో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా సవరణలు తప్పనిసరి అని లేఖలో సీఈసీ పేర్కొంది.

అదేవిధంగా ఎన్నికల విరాళాలు, ఖర్చు కోసం ప్రతి అభ్యర్థి విడిగా బ్యాంకు ఖాతా తెరవాలని లేఖలో కోరింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021

తాజా వార్తలు