పాపం!!"విమర్శించారు".. కేసుల్లో చిక్కుకున్నారు

ప్రస్తుత రాజకీయాల్లో ప్రతీ పార్టీలో నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ.నిందలు వేసుకుంటూ ఉండడం సర్వ సాదారణం.

అయితే కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రంలో మాత్రం ఈ విమర్శ ప్రతి విమర్శల పై ప్రభుత్వం, మరియు ప్రజలు ఒకింత సీరియస్ గానే ఉంటున్నారు.విషయం ఏమిటంటే తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పై, ముఖ్యమంత్రి పై, ప్రతిపక్షాలు విమర్శలు చేసే క్రమంలో తెలుగు దేశం పార్టీ నేతలు ఎర్రబెల్లి, రావుల చంద్రశేఖర్ రావులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కేంద్రంగా కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, తెలంగాణా చిహ్నాలను విమర్శించారంటూ వీరిపై తెలంగాణా న్యాయవాదుల జే.ఏ.సీ నేత గోవర్ధన్ రెడ్డి కోర్టు తలుపు తట్టగా వారి విన్నపాన్ని పరిగణ లోకి తీసుకున్న నాంపల్లి కోర్టు వీరిద్దరిపై కేసులు నమోదు చెయ్యాల్సిందిగా ఆదేశించింది.ఇక కోర్టు ఆదేశాల ప్రకారం బంజారా హిల్స్ పోలీసులు వీరిపై కేసులు నమోదు చేశారు.

ఇంతవరకు బాగానే ఉన్నా.విమర్శలకే కేసులు నమోదు చేస్తే ట్యాంక్ బండ్ పై విగ్రహాల ధ్వంసంలో కారకులైన వారిని ఏం చెయ్యాలో ఆ ప్రభుత్వానికి, పెద్దలకే తెలియాలి.

కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సస్పెండ్.. జేడీఎస్ ఆదేశాలు
Advertisement

తాజా వార్తలు