ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగిందే.. స్టంట్స్ చేస్తుంటే ప్రమాదం!

రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు నిబంధనలు పాటించాలి.ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రయాణం సాఫీగా సాగుతుంది.

గమ్యం చేరే వరకు అత్యంత జాగురుకతతో ఉండాలి.కారు నడిపై వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి.

సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదు.బైక్ పై వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించాలి.

ఇవన్నీ ట్రాఫిక్ చెప్పే సూచనలు, జాగ్రత్తలు.కానీ చాలా మంది వాటిని ఏమాత్రం పట్టించుకోరు.

Advertisement
Car Collided With A Divider In Solan Details, Car Collided, Himachal Pradesh, So

మరింత నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతుంటారు.మద్యం మత్తులో తూగుతూ డ్రైవింగ్ చేస్తారు.

మరికొందరైతే రోడ్డుపైనే స్టంట్స్ చేస్తారు.ఇతరుల వాహనదారులు భయపడతారు, వారికి ప్రమాదం పొంచి ఉంటుంది అనేది అలాంటి వాళ్లు ఏమాత్రం పట్టించుకోరు.

ఇలా ఓ వాహనదారుడు చేసిన నిర్వాకం అతడి ప్రాణాల మీదకే తెచ్చింది.హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లా అది.కొందరు యువకులు నడిరోడ్డుపైనే కారు డోర్ తెరిచి విన్యాసాలు చేశారు.ఈ క్రమంలో కారు అదుపు తప్పింది.

మూల మలుపు వద్ద కారు కంట్రోల్ కాకపోవడంతో డివైడర్ పైకి దూసుకుపోయింది.

Car Collided With A Divider In Solan Details, Car Collided, Himachal Pradesh, So
ప్రతిరోజూ 30నిమిషాలు నడిస్తే ఈ వ్యాధులకు చెక్

ఇటు రోడ్డు నుండి అటు వైపు రోడ్డుపైకి వెళ్లి అక్కడ మరో కారును ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్పల్ప గాయాలు అయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

Advertisement

కారుతో స్టంట్స్ చేయడమే కాకుండా, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పై కేసు పెట్టారు.ఈ ఘటనకు సంబంధించిన కారు స్టంట్స్ దృశ్యాలను వెనక వస్తున్న మరో కారులో ఉన్న ప్రయాణికులు వీడియో తీశారు.

వాటిని సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ వీడియో కాస్త వైరల్ అయింది.

తాజా వార్తలు