బీటెక్ విద్యార్థిని దారుణ హత్య గుంటూరులో కిరాతకం..

స్వాతంత్ర దినోత్సవం రోజే బీటెక్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది.గుంటూరు-కాకాని రోడ్డు పరమాయికుంటలో ఈ దారుణం జరిగింది.

బీటెక్ చదువుతున్న నల్లపు రమ్యను ఓ యువకుడు కత్తితో పొడిచి హత్య చేశాడు.స్థానికులు తెలిపిన వివరాల మేరకు ప్రైవేట్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న రమ్య కాకాని రోడ్డు లో వెళ్తుంది.

అటుగా వచ్చిన యువకుడు తన బైక్ మీద ఎక్కాలని విద్యార్థిని అడిగాడు అందుకే ఆమె నిరాకరించడంతో వెంట తెచ్చుకున్న కత్తితో మెడ, పొట్టలో పొడిచి పరారయ్యాడు.రక్తపు మడుగులో ఉన్న రమ్యను స్థానికులు వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆస్పతకి తరలించారు.

అప్పటికే మృతి చెందిందని జీజీహెచ్ వైద్యులు తెలిపారు.నిందితుడిని గుంటూరు అర్బన్ పోలీసులు వెంటనే అరెస్టు చేశారు ఈ విషయాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు.

Advertisement

స్థానికులు ఇచ్చిన సమాచారం సిసిటివి ఫుటేజ్ ఆధారంగా  నిందితుడిని పమిడిపాడు వద్ద పట్టుకున్నారు అని తెలిపారు.నిందితుడిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామన్నారు కేసును వెంటనే ఛేదించిన పోలీసులను డీజీపీ అభినందించారు.

విషయం తెలుసుకున్న రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత హుటాహుటిన జీజీహెచ్ కు చేరుకున్నారు.కన్య మృతదేహాన్ని సందర్శించారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు తెలిపారు.

ఇప్పటికే నిందితులకు సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరించినట్లు తెలిపారు.రమ్య హత్య దారుణం అని వ్యాఖ్యానించారు పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారని రమ్య ఫోన్ అన్లాక్ చేసిన తర్వాత మరింత సమాచారం తెలిసే అవకాశం ఉందని తెలిపారు.

రమ్య కుటుంబ సభ్యులకు స్నేహితులకు వివరిస్తామన్నారు ఈ సంఘటన పై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు అమె చెప్పారు.బాధిత కుటుంబాన్ని ఆదుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని పరిహారంగా 10 లక్షలు రూపాయలు కుటుంబానికి ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు.

వైసీపీ కార్యాలయం కూల్చివేత పై జగన్ ఏమన్నారంటే ? 
Advertisement

తాజా వార్తలు