మళ్లీ బీఆర్ఎస్‎దే విజయం..: కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి కూడా బీఆర్ఎస్ పార్టీనే విజయం సాధిస్తుందని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు.

తెలంగాణభవన్ లో పార్టీ అభ్యర్థులు, నియోజకవర్గ ఇంఛార్జ్ లతో ఆయన సమావేశం అయ్యారు.

ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్ నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరూ తొందరపడొద్దన్నారు.

భవిష్యత్ లో గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయని చెప్పారు.న్యాయపరమైన ఇబ్బందుల కారణంగా వేములవాడలో అభ్యర్థిని మార్పు చేసినట్లు తెలిపారు.

ఎన్నికల ఘట్టంలో కీలకంగా పని చేయాలని సూచించారు.ఈ క్రమంలో ప్రతి కార్యకర్తతో నేతలు మాట్లాడాలని చెప్పారు.

Advertisement

సామరస్య పూర్వకంగానే సీట్ల సర్దుబాటు జరిగిందన్న కేసీఆర్ ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలన్నారు.ఓపిక పట్టకపోతే నష్టపోతామన్న కేసీఆర్ అందుకు తన అనుభవమే నిదర్శనమని వెల్లడించారు.

వైరల్ వీడియో : అమరావతి శంకుస్థాపన వేదికకు మోకాళ్లపై కూర్చొని నమస్కరించిన సీఎం..
Advertisement

తాజా వార్తలు