ఎగ్జిట్ పోల్స్ పై స్పందించిన కేటీఆర్..!!

దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల ఎగ్జిట్ పోల్స్( Exit polls) శనివారం సాయంత్రం విడుదలయ్యాయి.

ఈ క్రమంలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ స్థానం కూడా గెలిచే అవకాశాలు లేవని మెజారిటీ సంస్థలు ప్రకటించాయి.

ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో గులాబీ దళం డీల పడింది.దీంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) స్పందించారు.

జూన్ 4వ తారీఖు వచ్చే అసలు ఫలితాలు కోసం తాము ఎదురుచూస్తున్నట్లు మీడియాతో స్పష్టం చేశారు.అటు కేసీఆర్ పోరాటంతో పదేళ్ల క్రితం తెలంగాణ స్వరాష్ట్రం వచ్చిందని గుర్తు చేశారు.

ఇదిలా ఉంటే ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ మరియు బీజేపీ( BJP ) రెండు జాతీయ పార్టీలు భారీ ఎత్తున పార్లమెంటు స్థానాలు గెలవబోతున్నట్లు సర్వే సంస్థలు తెలియజేశాయి.ప్రధానంగా బీజేపీ అత్యధిక మెజార్టీ పార్లమెంట్ స్థానాలు గెలవబోతున్నట్లు అనేక సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ లో ప్రకటించడం జరిగాయి.ఇండియా టుడే సర్వే కూడా ఇదే విషయాన్ని తెలియజేయడం జరిగింది.

Advertisement

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ 11 నుంచి 12, కాంగ్రెస్ 4 నుండి 6, బీఆర్ఎస్ 0 నుండి 1, ఎంఐఎం 1 స్థానం గెలిచే అవకాశాలు ఉన్నట్లు స్పష్టం చేయడం జరిగింది.దేశవ్యాప్తంగా ఈసారి ఏడు దశలలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.

తుది దశ ఎన్నిక నేడు ముగిసింది.దీంతో సాయంత్రం ఆరున్నర గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కావడం జరిగాయి.

ఇక అసలైన ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి.

పెళ్లిళ్ల సీజన్ వచ్చింది తులం బంగారం తూచేనా ? 
Advertisement

తాజా వార్తలు