భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో బీఆర్ఎస్ ఆధిక్యంలోకి వచ్చింది.ఈ క్రమంలో భద్రాచలం నియోజకవర్గంలో సుమారు 3,440 ఓట్లతో ముందంజలో ఉంది.
అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మొత్తం పది స్థానాల్లో కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది.అలాగే బీఆర్ఎస్ ఒక స్థానంలో ఆధిక్యంలోకి రాగా సీపీఐ ఒక స్థానంలో ఆధిక్యతను కొనసాగిస్తుంది.
కాగా ఇందులో అశ్వరావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ విజయం సాధించినట్లు అధికారిక ప్రకటన వెల్లడైన సంగతి తెలిసిందే.మరో నియోజకవర్గం ఇల్లందులోనూ కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య సుమారు 35 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో దూసుకెళ్తున్నారు.