బీఆర్ఎస్ కు మళ్లీ గుర్తుల టెన్షన్ !

ప్రతి ఎన్నికల్లోనూ ఒక పార్టీ ఎన్నికల గుర్తును పోలి ఉండే విధంగా .స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తున్న గుర్తులు టెన్షన్ పెట్టిస్తూనే ఉన్నాయి.

ముఖ్యంగా తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ను గత ఎన్నికల్లో కొన్ని గుర్తులు ఇబ్బందులు పెట్టాయి.త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో( Parliament elections )ను కొన్ని గుర్తులు బీ ఆర్ ఎస్ కు ముచ్చెమటలు  పట్టిస్తున్నాయి .ముఖ్యంగా రోడ్ రోలర్, చపాతి మేకర్ గుర్తులు ఇప్పుడు బీఆర్ఎస్ ను టెన్షన్ పెడుతున్నాయి.టిఆర్ఎస్ కారు గుర్తును పోలివున్న అనేక గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడంతో, టిఆర్ఎస్ ఆందోళన చెందుతోంది.

యుగ తులసి పార్టీకి ఎన్నికల సంఘం అధికారికంగా రోలర్ గుర్తును కేటాయించగా , మరో స్వతంత్ర అభ్యర్థికి చపాతి మేకప్ గుర్తు దక్కింది.బ్యాలెట్ లో నాలుగో అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న టి పద్మారావు గౌడ్( Padma Rao Goud) ఉండగా , ఐదో అభ్యర్థిగా రోడ్డు రోలర్ ఉన్న యుగతులసి పార్టీ అభ్యర్థి కొలిశెట్టి శివకుమార్ ఉన్నారు.

కారు , రోడ్డు రోలర్ గుర్తులు బ్యాలెట్ లో పక్కపక్కనే ఉండడంతో,  ఓటర్లు అయోమయానికి గురవుతారు అనే భయం బీఆర్ఎస్ లో  నెలకొంది.

Advertisement

 హైదరాబాద్ లో స్వతంత్ర అభ్యర్థికి చపాతి మేత గుర్తును కేటాయించారు.రోడ్డు రోలర్,  చపాతి మేకర్ గుర్తులను ఏ పార్టీకి ,స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించకుండా ఆదేశాలు జారీ చేయాలని అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు( Brs party )ను ఆశ్రయించింది .పార్టీ పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.ఈ నేపథ్యంలో మరోసారి బీఆర్ఎస్ పార్టీకి అవే గుర్తులు ఇబ్బందికరంగా మారాయి.

తమ పార్టీ అభ్యర్థుల గెలుపు అవకాశాలను కచ్చితంగా ఈ రెండు గుర్తులు దెబ్బతీస్తాయని టెన్షన్ పడుతోంది.ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభావం ఎక్కువగా ఉండడం,  బిజెపి( BJP ) కూడా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండడం తదితర అంశాలన్నీ బీఆర్ఎస్ కు కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి.

 దీనికి తోడు గత బిఆర్ఎస్ ప్రభుత్వం లోని లోపాలను,  అవినీతి వ్యవహారాలను హైలెట్ చేస్తూ కాంగ్రెస్ , బిజెపి లు  జనాల్లోకి వెళ్లి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ఉండడం వంటివన్నీ బిఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారాయి.  ఒకవైపు ఈ వ్యవహారాలు , మరోవైపు గుర్తులు టెన్షన్ తో బీఆర్ఎస్ నేతలకు కంటిమీద కునుకు లేకుండా పోయిందట.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు