ఎన్నికల తరువాత కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..: మంత్రి ఉత్తమ్

తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Minister Uttam Kumar Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.

సూర్యాపేట జిల్లా( Suryapet District ) చింతలపాలెం మండలానికి కృష్ణా నీళ్లు అందిస్తామని తెలిపారు.

గత ఐదేళ్లుగా అభివృద్ధి కుంటుపడిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.అటు బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు.

రానున్న లోక్ సభ ఎన్నికల్లో( Loksabha Elections ) బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని చెప్పారు.పార్లమెంట్ ఎన్నికల తరువాత 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారని పేర్కొన్నారు.

అదేవిధంగా ఇండియా కూటమి నుంచి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
గోడలో వింత శబ్దాలు.. గోడను పగలకొట్టి చూస్తే? (వీడియో)

తాజా వార్తలు