రేవంత్ కు మరో లేఖ రాసిన హరీష్ రావు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని( CM Revanth Reddy ) టార్గెట్ చేసుకుంటూ మాజీ మంత్రి, బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు( Harish Rao ) వరుసగా లేఖలు రాస్తున్నారు నిన్ననే అనేక అంశాలను ప్రస్తావిస్తూ.

కాంగ్రెస్ తెచ్చిన ఎన్నికల మేనిఫెస్టోను గుర్తు చేస్తూ, రైతుల అంశాలను, వారి ఇబ్బందులను ప్రస్తావిస్తూ హరీష్ రావు లేక రాసిన సంగతి తెలిసిందే.

తాజాగా మరోసారి లేఖ రాస్తూ.  అనేక ప్రశ్నలను సంధించారు.

తెలంగాణలో కాంగ్రెస్( Congress ) అధికారంలోకి రాగానే రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమైందని హరీష్ రావు విమర్శించారు.డిసెంబర్ 9 న రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఒకేసారి చేస్తామని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని హరీష్ రావు గుర్తు చేశారు.

ఈ మేరకు లేఖలో అనేక ప్రశ్నలు సంధించారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష రూపాయల రుణమాఫీ పొందిన రైతులు కూడా మళ్లీ బ్యాంకులకు వెళ్లి రెండు లక్షల రుణాలు తీసుకోవాలని రేవంత్ స్వయంగా పిలుపునిచ్చారని హరీష్ రావు లేఖలో గుర్తు చేశారు.

Brs Mla Harish Rao One More Letter To Cm Revanth Reddy Details, Harish Rao, Brs,
Advertisement
Brs Mla Harish Rao One More Letter To Cm Revanth Reddy Details, Harish Rao, Brs,

రేవంత్ మాటను నమ్మి రాష్ట్రంలోని లక్షలాదిమంది రైతులు బ్యాంకుల నుంచి పంట రుణాలు( Crop Loans ) తీసుకున్నారని, డిసెంబర్ 9 నాడు మీరు ప్రకటించినట్లు గానే రుణమాఫీ జరగలేదని గుర్తు చేశారు.మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు కావస్తుందని, అయినప్పటికీ ఒక్క రైతుకు కూడా ఒక రూపాయి రుణమాఫీ కాలేదని రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో హరీష్ రావు ప్రశ్నించారు.బ్యాంకులు మాత్రం రైతులకు నోటీసులు మీద నోటీసులు ఇస్తున్నాయని, ప్రభుత్వ హామీతో తమకు సంబంధం లేదని, తీసుకున్న అప్పుకు వడ్డీతో సహా కిస్తీలు చెల్లించి తీరాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నాయని హరీష్ రావు అన్నారు.

ఉమ్మడి వరంగల్ ,ఉమ్మడి మెదక్ జిల్లాలో వందలాది మంది రైతులకు బ్యాంకు నోటీసులు అందాయని, దీనిపై రైతులు( Farmers ) ఆందోళన చెందుతున్నారని, తీసుకున్న అప్పుకు వడ్డీ మీద వడ్డీ కారణంగా రైతులపై ఆర్థిక భారం పడుతుందని హరీష్ రావు వివరించారు.రైతులను బ్యాంకులు డి ఫాల్డర్ జాబితాలోకి ఎక్కిస్తున్నాయని, సిబిల్ రేటింగ్ కూడా దారుణంగా పడిపోతుందని, రైతుల పిల్లల చదువు కోసం విద్యా రుణాలతో పాటు, ఇతర రుణాలు పొందలేకపోతున్నారని ,ఈ సమస్యలతో రైతులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని హరీష్ రావు వివరించారు.

Brs Mla Harish Rao One More Letter To Cm Revanth Reddy Details, Harish Rao, Brs,

కేసీఆర్( KCR ) నాయకత్వంలో రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) రెండుసార్లు లక్ష రూపాయలు చొప్పున 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు.ఏ ఒక్క బ్యాంకు కూడా రుణాలు చెల్లించలేదని ఎప్పుడూ రైతులపై ఒత్తిడి తీసుకురాలేదని, లక్ష రూపాయల వరకు రైతులకు సంబంధించిన రుణాలు మేమే కడతామని బ్యాంకర్లకు బీ ఆర్ ఎస్ ప్రభుత్వం ముందస్తు హామీ ఇచ్చిందని, దాని ప్రకారమే ప్రభుత్వ ఖజానా నుంచి బ్యాంకులకు చెల్లింపులు చేసిందని హరీష్ రావు లేఖలో గుర్తు చేశారు.రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి విధానము ప్రకటించకపోవడం, ఈ బడ్జెట్ లో రుణమాఫీ ప్రస్తావన లేకపోవడం వల్ల, రాష్ట్రంలో ప్రజలు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారని, రుణమాఫీ పై ప్రభుత్వం నేటి వరకు అటు బ్యాంకర్లకు గాని, ఇటు రైతులకు గాని ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదని హరీష్ రావు లేఖలో మండిపడ్డారు.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు