ఓటమి భయంతో ఆ ఎన్నికలకు దూరం గా ఉండబోతున్న బీఆర్ఎస్..!!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక అందరి చూపు పార్లమెంట్ ఎన్నికల ( Parliament Elections ) పైనే పడింది.

అయితే ఈ రెండు ఎన్నికలకు మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి.

త్వరలోనే వరంగల్,ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి.అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం.

ఇక విషయంలోకి వెళ్తే.బీఆర్ఎస్ నుండి గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి ( Palla Rajeshwar Reddy ) పోటీ చేసి గెలిచారు.

ఇక ఈ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డికి పోటీగా ఇండిపెండెంట్ అభ్యర్థి గా తీన్మార్ మల్లన్న,టీజేఎస్ నుండి ప్రొఫెసర్ కోదండరాం,రాణి రుద్రమ కూడా పోటీ చేశారు.ఇక ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందగా స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న తీన్మార్ మల్లన్న రెండో ప్లేస్ లో నిలిచారు.

Brs Is Going To Stay Away From That Election Due To Fear Of Defeat, Brs , Congre
Advertisement
BRS Is Going To Stay Away From That Election Due To Fear Of Defeat, BRS , Congre

ఇక ఈ ఎన్నికలకు కాంగ్రెస్ దూరంగా ఉంది.అయితే అప్పట్లో కాంగ్రెస్ చేసినట్లే ఇప్పుడు కూడా బీఆర్ఎస్ (BRS) పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.ఎందుకంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పూర్తి దృష్టి ఎంపీ ఎన్నికల పైనే పెట్టిందట.

అలాగే ఎమ్మెల్సీ స్థానాన్ని ఎవరికి ఇవ్వాలో తెలియని పరిస్థితిలో ఎవరికి ఇచ్చిన లో లోపల కుమ్ములాటలు జరుగుతాయి అనే ఉద్దేశంతో బీఆర్ఎస్ దట.ఇక ఈసారి కాంగ్రెస్ లో చేరిన తీన్మార్ మల్లన్న ( Teenmar Mallanna ) కి కచ్చితంగా ఎమ్మెల్సీ టికెట్ వస్తుందని చాలామంది భావిస్తున్నారు.అలాగే ప్రొఫెసర్ కోదండరాం కూపార్టీ పూర్తిగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలనే ఆలోచన చేస్తుందట.

Brs Is Going To Stay Away From That Election Due To Fear Of Defeat, Brs , Congre

ఎన్నికలకు దూరంగా ఉన్నప్పటికీ ఎవరైనా స్వతంత్ర అభ్యర్థి నిలబడితే తమ సపోర్ట్ ఏమాత్రం లేదు అన్నట్లుగా బయటికి ఉండి పరోక్షంగా మాత్రం ఆ స్వతంత్ర అభ్యర్థికి మద్దతు తెలిపాలి అని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తుండా పోటీ చేయబోతున్నట్టు సమాచారం.మరి కోదండరాం ( Kodandaram ) ఆయన పార్టీని కాంగ్రెస్లో కలిపి పోటీ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.అయితే ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండబోతుందని వార్తలు వినిపించినప్పటి నుండి చాలామంది ఇతర పార్టీల నేతలు ఓడిపోతుందని భయంతోనే బిఆర్ఎస్ ఎన్నికల్లో నిలబడడం లేదు.

ఒకవేళ ఓడిపోతే తమ పార్టీ పరువు మరింత దిగజారిపోతుంది అనే ఉద్దేశంతోనే సైలెంట్ గా ఎన్నికలకు దూరంగా ఉంటారు అని మాట్లాడుకుంటున్నారు.మరి చూడాలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ ఉంటుందా లేదా అనేది.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!
Advertisement

తాజా వార్తలు