కాళేశ్వరం మీద ప్రభుత్వ ఆరోపణలపై బీఆర్ఎస్ కౌంటర్

కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది.ఈ క్రమంలోనే రూ.93 వేల కోట్ల ఖర్చు జరిగితే లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందని బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి ప్రశ్నించారు.

 Brs Counters The Government's Allegations On Kaleshwaram-TeluguStop.com

ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలు, న్యాయ విచారణలను స్వాగతిస్తున్నామని కడియం శ్రీహరి తెలిపారు.

ప్రాజెక్టు అంచనాలు పెరిగిపోతున్నాయని ప్రభుత్వం అంటోందన్న ఆయన దేశంలో ఏ ప్రాజెక్టు అయినా అంచనాలు పెంచకుండా పూర్తి చేశారా అని నిలదీశారు.కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లి మంత్రులు వాస్తవాలు చెప్పారన్నారు.

కాళేశ్వరం కింద ఒక్క ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వలేదని ఆరోపించారన్న కడియం శ్రీహరి 98 వేల ఎకరాలకు సాగునీరు అందించినట్లు అధికారులు చెప్పారన్న విషయాన్ని గుర్తు చేశారు.అలాగే తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కడితే లాభం లేదని కేంద్రమే చెప్పిందని పేర్కొన్నారు.

పనులు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube