జలుబుతో బాధ‌ప‌డుతున్నారా..బ్రౌన్ షుగ‌ర్‌తో చెక్ పెట్టండిలా!

జ‌లుబు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్క‌రు ఎప్పుడో ఒకప్పుడు కచ్చితంగా ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కొనే ఉంటాయి.

ఈ జ‌లుబు ఒక్క సారి వ‌చ్చిదంటే ఎన్ని మందులు వేసుకున్నా ఓ ప‌ట్టాన పోదు.పైగా ఇదో అంటు వ్యాధి.

ఒక‌రికి వ‌చ్చిందంటే.వెంట‌నే ఇంట్లో అంద‌రికీ సోకేస్తుంది.

జ‌లుబు చేసిన‌ప్పుడు ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు, తుమ్ములు, గొంతులో ఇరిటేష‌న్ ఇలా ఎన్నో స‌మ‌స్య‌లు కూడా ఇబ్బంది పెడ‌తాయి.అందుకే జ‌లుబు అంటే భాయ‌ప‌డిపోతుంటారు.

Advertisement

ఇక ప్ర‌స్తుతం క‌రోనా టైమ్ న‌డుస్తోన సంగ‌తి తెలిసిందే.ఈ స‌మ‌యంలో జ‌లుబు చేసిందంటే చాలు ఎక్క‌డ క‌రోనా వైర‌స్ సోకిందో అని హ‌డ‌లెత్తిపోతున్నారు ప్ర‌జ‌లు.

అయితే జ‌లుబు చేసినంత మాత్రానా క‌రోనా ఉన్న‌ట్టు కాదు.ఒక్కోసారి వాతావ‌ర‌ణం మార్పులు, ఆహార‌పు అల‌వాట్ల వ‌ల్ల కూడా జ‌లుబు చేస్తుంది.

అలాంట‌ప్పుడు కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే త్వ‌ర‌గా కోలుకోవ‌చ్చు.ముఖ్యంగా జ‌లుబుకు చెక్ పెట్ట‌డంలో బ్రౌన్ షుగ‌ర్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

మ‌రి బ్రైన్ షుగ‌ర్‌ను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.ఒక గ్లాస్ వాట‌ర్‌లో ఒక స్పూన్ బ్రౌన్ షుగ‌ర్‌, లైట్‌గా దంచి పెట్టుకున్న చిన్న అల్లం ముక్క, చిటికెడు మిర్యాల పొడి వేసి బాగా మ‌రిగించాలి.అనంత‌రం ఆ నీటిని వాడ‌బోసుకుని.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
యూఎస్ ఆర్మీలోని ట్రాన్స్‌జెండర్స్‌పై ట్రంప్ సంచలన నిర్ణయం?

గోరు వెచ్చ‌గా అయిన త‌ర్వాత సేవించాలి.ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే జ‌లుబు ప‌రార్ అవుతుంది.

Advertisement

జ‌లుబు మాత్ర‌మే కాదు.బ్రౌన్ షుగ‌ర్ వాడ‌టం వ‌ల్ల మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.

బ్రౌన్ షుగ‌ర్ తీసుకుంటే బ‌రువు అదుపులో ఉంటుంది.జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరును మెరుగు ప‌రుస్తుంది.

ఆస్త‌మా స‌మ‌స్య‌ను కంట్రోల్ చేస్తుంది.శ‌రీరానికి స‌హ‌జంగా శ‌క్తిని అందిస్తుంది.

అందుకే ఆరోగ్య నిపుణులు కూడా వైట్ షుగ‌ర్‌కు బ‌దులుగా బ్రౌన్ షుగ‌ర్ వాడ‌మ‌ని చెబుతుంటారు.

తాజా వార్తలు