ఇటీవల సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా వచ్చిన “బ్రో”( Bro Movie ) ఏపీ రాజకీయాల్లో వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో శ్యాంబాబు పాత్ర మంత్రి అంబాటి రాంబాబు( Ambati Rambabu ) పాత్రను పోలి ఉందని కామెంట్లు వస్తున్నాయి.
ఇదే విషయంపై మంత్రి అంబాటి రాంబాబు సైతం విమర్శలు కూడా చేయడం జరిగింది.ఇదే సమయంలో మంగళవారం మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతూ “బ్రో” సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శలు చేశారు.
రాజకీయ ప్రత్యర్థులపై సినిమా పరంగా పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడంతో సినిమా పరాజయం పాలయ్యిందని అన్నారు.అంతేకాదు ఈ సినిమా వెనుక బ్లాక్ మనీని వైట్ గా మార్చే కుట్ర జరుగుతున్నట్లు కూడా ఆరోపించారు.

ఈ క్రమంలో మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై “బ్రో” సినిమా నిర్మాత విశ్వప్రసాద్( Producer Vishwaprasad ) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.మంగళవారం విశ్వప్రసాద్ ఓ మీడియా ఛానల్ లో మాట్లాడుతూ “బ్రో” చిత్ర నిర్మాణం పై మంత్రి అంబాటి రాంబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.వినోదాత్మకమైన సినిమాపై రాజకీయపరంగా విమర్శలు రావటం అసలు ఊహించలేదని ఒక రాష్ట్ర మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు.ఈ సినిమా నిర్మాణానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు.ఇదే సమయంలో రాజకీయంగా అన్ని పార్టీల నాయకులతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు విశ్వప్రసాద్ స్పష్టం చేశారు.“బ్రో” సినిమా కలెక్షన్లపై మంత్రి అంబాటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని పేర్కొన్నారు.







